ETV Bharat / sports

'నీ బౌలింగ్​ సూపర్- స్లెడ్జింగ్​ లేకుంటే బెటర్​'

author img

By

Published : Mar 5, 2021, 8:21 AM IST

Updated : Mar 5, 2021, 10:52 AM IST

భారత యువ బౌలర్​ మహ్మద్​ సిరాజ్​ను పొగడ్తలతో ముంచెత్తాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు గ్రేమ్​ స్వాన్. అతని తెలివైన బౌలింగ్​తో ఇంగ్లాండ్​ జట్టుకు చేయాల్సిన నష్టం చేశాడని తెలిపాడు. అద్భుతమైన బౌలింగ్​ నైపుణ్యమున్న సిరాజ్​.. వాగ్వాదాలకు దూరంగా ఉండాలని సూచించాడు.

Siraj was brilliant but shouldn't have sledged Ben Stokes: Graeme Swann
'అద్భుతమైన బౌలింగ్​ నీది.. వాగ్వాదాలకు దూరంగా ఉండు'

టీమ్ఇండియా బౌలర్​ మహ్మద్​ సిరాజ్​పై ప్రశంసల జల్లు కురిపించాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్​. రెండు కీలక వికెట్లతో పర్యటక జట్టును తక్కువ పరుగులకే ఆలౌట్​ చేయడంలో సిరాజ్​ కీలక పాత్ర పోషించాడని స్వాన్​ పేర్కొన్నాడు.

"పిచ్​పై ఉన్న తేమను సీనియర్​ బౌలర్​ ఇషాంత్​ వినియోగించుకుంటాడనుకున్నాను.. కానీ అనూహ్యంగా కొత్త కుర్రాడు సిరాజ్ ఆ పని చేశాడు. తన తెలివైన బౌలింగ్​తో ఇంగ్లాండ్​ జట్టుకు చేయాల్సిన నష్టం చేశాడు. ఈ విషయంలో ఇషాంత్​ కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు. ముఖ్యంగా కెప్టెన్ రూట్​ను ఔట్​ చేసిన విధానం.. అతని తెలివైన బౌలింగ్​కు నిదర్శనం. వరుసగా ఔట్​ స్వింగర్లు వేస్తూ రూట్​ను మభ్యపెట్టాడు. తర్వాత ఒక్కసారిగా ఇన్​స్వింగ్​తో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు."

-గ్రేమ్​ స్వాన్​, ఇంగ్లాండ్ మాజీ బౌలర్​.

"30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రూట్​సేనను బెయిర్​ స్టో, బెన్​ స్టోక్స్​లు కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. నాల్గో వికెట్​కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది ఈ జోడీ. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన బెయిర్​ను ఓ చక్కటి బంతితో సిరాజ్​ వెనక్కి పంపాడు. కానీ స్టోక్స్​తో వాగ్వాదం సరైనది కాదు. ఇందులో భారత కెప్టెన్ కోహ్లీ కూడా మాట్లాడాల్సి వచ్చింది. విషయం అంపైర్ల వరకు వెళ్లింది. దీని వల్ల స్టోక్స్​ ఏకాగ్రత చెడిపోయింది. బౌలింగ్​తో అద్భుతంగా రాణిస్తున్న సిరాజ్..​ స్లెడ్జింగ్​లకు దూరంగా ఉంటూ బౌలింగ్​పై దృష్టి సారించండం మంచిది. దానితోనే ప్రత్యర్థులకు సమాధానం చెపితే బాగుంటుందని" స్వాన్​ సూచించాడు.

ఇదీ చదవండి: వికెట్ల వేటలో దూసుకెళ్తున్న అక్షర్​

Last Updated : Mar 5, 2021, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.