ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్, అశ్విన్ అరుదైన ఘనతల్ని సాధించారు. అవేంటో ఓసారి చూద్దాం.
సిరాజ్
ఏడేళ్ల తర్వాత అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే 5 వికెట్లు సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు సిరాజ్. 2013లో కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో మహ్మద్ షమీ టెస్టు అరంగేట్రం చేసి తొమ్మిది వికెట్లు తీశాడు. తర్వాత ఇప్పుడు సిరాజ్ అరంగేట్రంలో ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. అశ్విన్ కూడా 2011లో అరంగేట్రంలోనే ఐదు వికెట్లు సాధించాడు.
అశ్విన్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు సాధించిన టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆసీస్ ఆటగాడు హెజిల్‌వుడ్‌ను ఔట్ టేసి టెస్టు క్రికెట్లో 192 లెఫ్టాండ్ బ్యాట్స్‌మెన్ వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా ఘనత సాధించాడు. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్ తన 800 వికెట్లలో 191 లెఫ్టాండర్ వికెట్లు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. తాజాగా ఈ రికార్డును తిరగరాశాడు అశ్విన్. అయితే అశ్విన్ తీసిన మొత్తం వికెట్లు 375లో దాదాపు సగం వికెట్లు ఎడమ చేతి బ్యాట్స్‌మెన్‌వి కావడం విశేషం.
బుమ్రా
రెండో టెస్టులో ఆరు వికెట్లతో సత్తాచాటిన బుమ్రా ఈ మ్యాచ్‌తో ఓ ఘనత సాధించాడు. మెల్బోర్న్ స్టేడియంలో ఎక్కువ వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా కుంబ్లే సరసన నిలిచాడు. అలాగే 2018 నుంచి విదేశాల్లో జరిగిన టెస్టుల్లో ఎక్కువ టెస్టు వికెట్లు సాధించిన బౌలర్‌గా బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుమ్రా ఖాతాలో 76 వికెట్లు ఉండగా, షమీ 61, ఇషాంత్ 53, కమిన్స్ 51 తర్వాత స్థానాల్లో ఉన్నారు.
మెల్బోర్న్లో భారత బౌలర్ల వికెట్లు
బౌలర్ | వికెట్లు | ఇన్నింగ్స్ |
---|---|---|
బుమ్రా | 15 | 4 |
కుంబ్లే | 15 | 6 |
కపిల్‌దేవ్ | 14 | 6 |