పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌కు ప్రమాదం తప్పింది. లాహోర్‌లో షోయబ్ కారు ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డాడు. తాను సురక్షితంగా ఉన్నట్లు ఈ ఘటన అనంతరం మాలిక్ ట్వీట్ చేశాడు.
పాక్ క్రికెట్ బోర్డు కార్యాలయం నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగం కారణంగానే షోయబ్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన ట్రక్కును ఢీకొట్టినట్లు సమాచారం.