ETV Bharat / sports

పాక్​ పరువు తీశారంటూ పీసీబీపై అక్తర్ మండిపాటు - pakistan cricket league

పాకిస్థాన్ సూపర్​ లీగ్​ వాయిదాపై ఆ దేశ మాజీ క్రికెటర్​ షోయబ్​ అక్తర్​ స్పందించాడు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారని.. పాక్​ క్రికెట్ బోర్డుపై మండిపడ్డాడు. లీగ్​ నిర్వహణలో విఫలమైన పీసీబీ.. బోర్డు పరువుతో పాటు దేశ పరువును తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

shoaib-akhter-lashes-out-at-pakistan-cricket-board
పాక్​ పరువు తీశారంటూ పీసీబీపై మండిపడ్డ అక్తర్​
author img

By

Published : Mar 5, 2021, 12:11 PM IST

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుపై ఆ జట్టు మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతనెలలో ప్రారంభమైన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) ఆరో సీజన్‌ను అర్ధాంతరంగా వాయిదా వేయడంపై మండిపడ్డాడు.

లీగ్‌ జరుగుతున్న సమయంలో కొంతమంది ఆటగాళ్లు బయోసెక్యూర్‌ నిబంధనల్ని ఉల్లంఘించడమే కాకుండా పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో లీగ్‌ను కొనసాగించడానికి ఆయా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. దీంతో పీఎస్‌ఎల్‌ను వాయిదా వేయగా... అక్తర్ ఇలా స్పందించాడు.

"సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. అందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బయోసెక్యూర్‌ పరిస్థితుల్ని పకడ్బందీగా అమలు చేయాల్సింది. ఉన్నతాధికారులు, మెడికల్‌ సిబ్బందిని శిక్షించాలి. వారు ఆటగాళ్ల జీవితాలతో ఆడుకున్నారు. బోర్డుతో పాటు దేశం పరువు తీశారు."

-షోయబ్​ అక్తర్​, పాకిస్థాన్ మాజీ క్రికెటర్​.

"ఈ ఘటనకు బాధ్యులుగా పీసీబీ సీఈఓ వసీమ్‌ఖాన్‌ పేరు బయటకు వచ్చింది. దీనిపై ఛైర్మన్​ ఎహ్సాన్ మణి సమాధానం చెప్పాలి. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలి. ఆటగాళ్ల కోసం బుక్‌ చేసిన హోటల్లో వివాహాలు, ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆటగాళ్లు కూడా నిబంధనల్ని అతిక్రమించి తిరిగారు" అని అక్తర్‌ మండిపడ్డాడు.

ఈ సంఘటన ఆటగాళ్ల జీవితాలను ప్రమాదంలోకి నెట్టినట్లైందని అక్తర్​ తెలిపాడు.

ఇదీ చదవండి: 'నీ బౌలింగ్​ సూపర్- స్లెడ్జింగ్​ లేకుంటే బెటర్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.