వరుస వైఫల్యాలతో విఫలమవుతోన్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ఏదీ కలిసి రావట్లేదు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ విఫలమయ్యాడు. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికైనా.. ఇప్పుడు గాయం కారణంగా టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.
ఫామ్ కోసం దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతోన్న ధావన్ గాయం బారిన పడ్డాడు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ కారణంగానే శిఖర్ స్థానంలో సంజూ శాంసన్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.
ప్రపంచకప్ తర్వాత 8 టీ20లు ఆడిన ధావన్.. 194 పరుగులు మాత్రమే చేసి విమర్శలపాలయ్యాడు. ప్రస్తుతం జరుగుతోన్న సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో ఐదు మ్యాచ్‌ల్లో 87 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు.
ఇవీ చూడండి.. 'పెళ్లికాక ముందు ప్రతి మగాడు సింహంలాంటోడే'