టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ మైదానంలోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటాడు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పోస్ట్ చేస్తుంటాడు. గాయం నుంచి ఇటీవలే కోలుకున్న శిఖర్.. చిన్నారులతో కలిసి సరదాగా చిందేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పంచుకున్నాడు.
"ప్రతి వ్యక్తిలోనూ చిన్నపిల్లాడుంటాడు. ప్రపంచానికి ఆనందాన్ని పంచేందుకు నేను ఎంతో ఇష్టపడతా. చిన్నారులు వాళ్ల నిర్మలమైన మనసును బయటకు వ్యక్తపరుస్తూ డ్యాన్స్ చేయడాన్ని ఎంతో ఆస్వాదించా"
-ధావన్, టీమిండియా ఆటగాడు
పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు వీడియోపై లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
మోకాలి గాయంతో జట్టుకు దూరమైన ధావన్.. శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లకు ఎంపికయ్యాడు. జట్టుకు దూరం కావడానికి ముందు గబ్బర్ పెద్దగా ఫామ్‌లో లేడు. నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడని విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే శ్రీలంకతో జరిగే టీ20లో పునరాగమనం చేస్తున్న అతడు.. తిరిగి తన లయను అందిపుచ్చుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జనవరి 5న లంకతో తొలి మ్యాచ్ ఆడనుంది టీమిండియా.
ఇవీ చూడండి.. కింగ్ కోహ్లీ మొదటి శతకానికి పదేళ్లు