లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న టీమ్‌ఇండియా క్రికెటర్లలో శిఖర్ ధావన్ ముందున్నాడు. ఆడుతూ.. పాడుతూ.. కసరత్తులు చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో ఎన్నడూ లేనంతగా సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. సరదా.. సరదా విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు.
తాజాగా తన కుమారుడు జొరావర్‌కు గుర్రపు స్వారీ నేర్పిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు గబ్బర్. "గుర్రపు స్వారీ చేయడంలో ఉన్న మజాని ఆస్వాదించడం జొరావర్‌కు నేర్పిస్తున్నా? తన కొత్త మిత్రుడితో సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేశాడు" అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
- View this post on Instagram
Teaching Zoraver the joy of horseback riding 🐎 He enjoyed time spent with his new friend ❤️
">
ప్రస్తుతం ఖాళీ సమయం దొరకడం వల్ల గబ్బర్ తన కొడుక్కి అన్నీ నేర్పిస్తున్నాడు. ఇంటి పనుల్లో సాయం చేయిస్తున్నాడు. సైకిల్ తొక్కడం నేర్పిస్తున్నాడు. ఇంకా పరుగెత్తిస్తున్నాడు. కొన్ని రోజుల ముందు ట్రిమ్మర్‌తో తన జుట్టును స్టైలిష్‌గా చేయించుకున్నాడు. మొన్న ఓ పంజాబీ పాటకు ఇద్దరూ కలిసి చిందులు వేశారు. తన సతీమణి ఆషేయాను డాన్స్ చేయాలని కోరగా ఆమె నిరాకరించింది. దాంతో "భార్యను ఒప్పించాలంటే కొడుకు సహాయం ఉండాల్సిందే" అని సోషల్ మీడియాలో చమత్కరించాడు.