ETV Bharat / sports

'యువరాజ్​, హర్భజన్​కు పాక్ క్రికెటర్ కృతజ్ఞతలు' - యువరాజ్​

కరోనాపై పోరాటంలో క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు టీమ్​ఇండియా ఆటగాళ్లు ప్రధానమంత్రి సహాయనిధికి విరాళాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్​కు చెందిన మాజీ ఆటగాడు షాహిద్​ అఫ్రిది.. పాక్ ప్రజలకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నాడు. ఈ పోరాటంలో యువరాజ్​, హర్భజన్​ సింగ్​ అతడికి మద్దతుగా నిలిచారు.

Shahid Afridi thanks Yuvraj Harbhajan Singh for supporting his foundation during Covid-19 crisis
'నా సోదరులైన యువరాజ్​, హర్భజన్​కు థ్యాంక్స్​'
author img

By

Published : Apr 1, 2020, 7:05 PM IST

భారత క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌కు పాకిస్థాన్‌ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది కృతజ్ఞతలు తెలిపాడు. కరోనా వైరస్‌పై పాక్‌లో చేస్తున్న తన పోరాటానికి మద్దతు పలికినందుకు ధన్యవాదాలు చెప్పాడు. ప్రేమ, శాంతికి సరిహద్దులు ఉండవని చాటిచెప్పారని కొనియాడాడు.

"మద్దతు తెలిపిన నా సోదరులు యువరాజ్‌ సింగ్, హర్భజన్‌ సింగ్‌కు ధన్యవాదాలు. మీ మద్దతు నాకు ఎంతో విలువైనది. మన మధ్య ఉన్న ఈ బంధం మానవత్వం, ప్రేమ, శాంతికి సరిహద్దులు ఉండవని చాటిచెబుతోంది. యువరాజ్‌ ఫౌండేషన్‌ యూవీకెన్‌కు అభినందనలు"

- షాహిద్​ అఫ్రిది, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​

పాకిస్థాన్‌లో కరోనాపై పోరాడేందుకు షాహిద్ అఫ్రిది తన ఫౌండేషన్‌ ద్వారా మందులు, ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాడు. దీంతో అతడు చేస్తున్న సేవలకు యువరాజ్‌, భజ్జీతో సహా పలు క్రికెటర్లు మద్దతు పలుకుతున్నారు.

Shahid Afridi thanks Yuvraj Harbhajan Singh for supporting his foundation during Covid-19 crisis
హర్భజన్​ సింగ్​, యువరాజ్​

ఇదీ చూడండి.. 'షేన్ వార్న్ అత్యుత్తమ జట్టులో లక్ష్మణ్​కు దక్కని చోటు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.