ETV Bharat / sports

41 లేదా 44.. షాహిద్​ ఆఫ్రిది వయసెంత? - 41, 44.. షాహిద్​ ఆఫ్రిది వయసెంత?

పాకిస్థాన్ మాజీ​ ఆల్​రౌండర్​ షాహిద్​ ఆఫ్రిది పుట్టినరోజున అతడి వయసు విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఐసీసీ రికార్డుల్లో ఒకవిధంగా, అతడి ఆత్మకథలో మరో విధంగా.. ప్రస్తుతం ట్విట్టర్​లో ఇంకో విధంగా ఉండటం వల్ల అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు.

Shahid Afridi 44 or 41? Pakistan cricketer's tweet on birthday triggers age debate once again
41, 44.. షాహిద్​ ఆఫ్రిది వయసెంత?
author img

By

Published : Mar 1, 2021, 1:30 PM IST

మార్చి 1.. పాకిస్థాన్ మాజీ ఆల్​రౌండర్​ షాహిద్ ఆఫ్రిది పుట్టిన తేదీ. దీంట్లో వింతేముంది అనుకుంటున్నారా! అతడి బర్త్​డే సందర్భంగా అతడి వయసెంత? అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఐసీసీ రికార్డుల్లో మాత్రం 1980 మార్చి 1గా ఉంది. దీని ప్రకారం అతడి ప్రస్తుత వయసు 41 ఏళ్లు.

పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు చెబుతుండగా.. ఆఫ్రిది ట్విట్టర్​ వేదికగా స్పందించాడు. "బర్త్​డే విషెస్​ చెప్పిన వారందరికీ ధన్యవాదాలు​.. 44వ జన్మదినంలోకి అడుగుపెట్టాను. కుటుంబం, అభిమానులే నా ఆస్తి" అని ట్వీట్​ చేశాడు.

  • Thank you very much for all the lovely birthday wishes - 44 today! My family and my fans are my biggest assets. Really enjoying my stint with Multan and hope to produce match winning performances for all MS fans.

    — Shahid Afridi (@SAfridiOfficial) February 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వయసు వ్యత్యాసంపై స్పందించిన పాకిస్థాన్ జర్నలిస్టు దన్యల్​ రసూల్​.. "హ్యాపీ బర్త్​డే ఆఫ్రిది. ప్రముఖ క్రీడా వెబ్​సైట్​ ప్రకారం మీ వయసు 41, మీ ఆత్మకథలో మాత్రం 46 అని రాసుకున్నారు. ప్రస్తుతం 44 అంటున్నారు!" అని ట్వీట్​ చేశారు.

దీనికి స్పందనగా ఓ అభిమాని.. "దయచేసి ఇలా ప్రస్తావించొద్దు. అతని వయసు 41 లేదా 44 కావొచ్చు. కానీ, అదొక సంఖ్య మాత్రమే!" అని రాశాడు.

"1996లో 16 ఏళ్ల వయసులోనే ఆఫ్రిది క్రికెట్​లోకి అడుగు పెట్టాడు. అలాంటిది 25 ఏళ్లలోనే అతడి వయసు 28 ఏళ్లు పెరిగిందనేది నమ్మశక్యంగా లేదని మరో క్రికెట్ అభిమాని" పోస్టు చేశాడు.

తన వయసుపై వచ్చిన వ్యత్యాసంపై 2019లో స్పందించాడు ఆఫ్రిది. '1998లో నా వయసు 19 ఉన్నప్పుడు క్రికెట్ అరంగ్రేటం చేశాను. అప్పుడు నా వయసు 16 కాదు. రికార్డుల్లో తప్పుగా రాశారని' షాహిద్​ తెలిపాడు. నైరోబి వేదికగా శ్రీలంకపై జరిగిన వన్డేలో 37 బంతుల్లోనే సెంచరీ బాదాడు​. అప్పుడు 16 ఏళ్ల వయసులో ఈ ఫీట్​ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

ఆఫ్రిది రాసిన 'గేమ్​ ఛేంజర్' పుస్తకం​లో మాత్రం తాను పుట్టింది 1975లో అని రాసుకొచ్చాడు. దీంతో అతని ప్రస్తుత వయసెంత? అనే గందరగోళంలో ఉన్నారు అభిమానులు.

ఇదీ చదవండి: 'పిచ్​పై విమర్శలు ఆపండి.. ఆటపై దృష్టి పెట్టండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.