ETV Bharat / sports

షాహిన్ రనౌట్.. నెటిజన్ల ఛలోక్తులు - పాక్​ క్రికెటర్​ షాహిన్ వీడియో వైరల్​

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్​లో పాకిస్థాన్​ క్రికెటర్​ షాహిన్​ ఆఫ్రిది రనౌట్​ అయ్యాడు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. నెటిజన్లు హాస్యభరితమైన కామెంట్లు పెడుతూ విపరీతంగా నవ్వుకుంటున్నారు.

Shaheen Afrini runout video viral..
షాహిన్ రనౌట్.. నెటిజన్ల ఛలోక్తులు
author img

By

Published : Aug 15, 2020, 3:34 PM IST

Updated : Aug 15, 2020, 4:20 PM IST

పాకిస్థాన్​ క్రికెటర్​ షాహిన్​ ఆఫ్రిది నెట్టింట్లో వైరల్​గా మారాడు. నెటిజన్లు ఇతడిపై ఫన్నీ కామెంట్లు కూడా పెడుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్​-పాకిస్థాన్​ మధ్య జరుగుతోన్న టెస్టు సిరీస్​లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్​లో అతడు రనౌట్​ అయిన తీరే ఇందుకు కారణం.

ఫన్నీగా ఔట్​ అయ్యాడే

సౌతాంప్టన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌ ఆడుతున్న పాక్‌ జట్టు 75 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్‌ రిజ్వాన్‌, షాహిన్‌ ఆఫ్రిది ఉన్నారు. క్రిస్‌ వోక్స్‌ వేసిన బంతి రిజ్వాన్‌ లెగ్‌ను తాకుతూ బయటికి వెళ్లింది. ఇంగ్లాండ్​‌ ఆటగాళ్లు అప్పీల్‌ కోసం అంపైర్‌ను అడిగారు. ఇంతలోనే స్ట్రైకింగ్‌లో ఉన్న రిజ్వాన్‌ కాల్‌ వినిపించుకోకుండానే షాహిన్‌ పరుగు కోసం సగం క్రీజు వదిలి వచ్చాడు. ఇంతలో బంతిని అందుకున్న డొమినిక్‌ సిబ్లే కళ్లు చెదిరే వేగంతో వేసిన డైరెక్ట్‌ త్రో నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో రనౌట్ అయ్యాడు షాహిన్​.

అనంతరం షాహిన్‌ ముఖానికి చేతిని అడ్డుపెట్టుకొని ఒక రకమైన ఫీలింగ్​తో డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఈసీబీ తన ట్విట్టర్​లో పోస్ట్​‌ చేసింది. సిబ్లే అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసాన్ని చూడండి అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఇది కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Shaheen Afrini runout video viral..
షాహిన్​ ఆఫ్రిది

మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే మొదటి టెస్టు మ్యాచ్​లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ చేతిలో పాక్ ఓటమిపాలైంది. రెండో టెస్టునూ పాక్​ నిరాశజనంకగానే ప్రారంభించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. మహ్మద్‌ రిజ్వాన్‌ 60, నసీమ్‌ షా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో అండర్సన్‌ 3, స్టువర్ట్‌ బ్రాడ్‌ 3, సామ్‌ కరన్‌, వోక్స్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

ఇది చూడండి దిగ్గజ జోర్డాన్​ బూట్లకు వేలంలో రికార్డు ధర!

Last Updated : Aug 15, 2020, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.