ETV Bharat / sports

సచిన్​ స్ఫూర్తితో లేడీ మాస్టర్​గా ఎదిగిన షెఫాలీ

author img

By

Published : Nov 12, 2019, 10:04 AM IST

చిన్న వయసులోనే అసమాన ప్రతిభతో ఆకట్టుకుంటోంది భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ. ఆమె తల్లిదండ్రులతో 'ఈటీవీ భారత్' ముచ్చటించింది. సచిన్​ తెందూల్కర్​ను అభిమానిస్తూ.. క్రికెట్ పట్ల షెఫాలీ ఆసక్తి పెంచుకుందని, అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో రికార్డులు అందుకుంటుందని వారు ఆనందం వ్యక్తం చేశారు.

సచిన్​ను చూస్తూ లేడీ మాస్టర్​గా ఎదిగిన షెఫాలి

15 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు.. స్కూల్లో స్నేహితులతో సరదాగా గడుపుతూ.. చదువుల్లో మునిగితేలుతుంటారు. కానీ టీమిండియా మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ మాత్రం అంతర్జాతీయ క్రికెట్​లో రికార్డులు సృష్టిస్తోంది.

ఇటీవల వెస్టిండీస్​తో జరిగిన తొలి టీ20లో రికార్డు అర్ధశతకం సాధించిన షెఫాలీ తల్లిదండ్రులతో 'ఈటీవీ భారత్'​ ముచ్చటించింది. ఆమెకు సంబంధించిన విశేషాలను తెలుసుకుంది.

అతితక్కువ వయసులో అర్ధశతకం చేసిన భారత క్రికెటర్​గా నిలిచింది షెఫాలీ వర్మ. 30 ఏళ్లుగా ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఘనత సాధించడంపై ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

హరియాణాలోని రోహతక్​లో పుట్టిన షెఫాలీ.. సచిన్​ను చూస్తూ క్రికెట్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అతడి ఆటంటే ఆమెకు ఎంతో ఇష్టమని తల్లి పర్వీన్ బాలా చెప్పారు.

మాస్టర్​ను ఆదర్శంగా తీసుకొని క్రికెట్​లో ఓనమాలు దిద్దిన షెఫాలీ.. ఇప్పుడు అంతర్జాతీయ రికార్డులు అందుకోవడం గర్వంగా ఉందని తండ్రి సంజీవ్ అన్నారు. ఇలాంటి మరెన్నో ఘనతలు అందుకుంటుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

వెస్టిండీస్​తో జరిగిన తొలి టీ20లో 43 బంతుల్లో 79 పరుగులు చేసి షెఫాలీ.. 30 ఏళ్లుగా ఉన్న సచిన్ రికార్డును అధిగమించింది. రెండో టీ20లోనూ 35 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఫలితంగా ఐదు మ్యాచ్​ల సిరీస్​లో.. ప్రస్తుతం 2-0 తేడాతో ముందంజలో ఉంది భారత్.

స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్​తో టీ20ల్లోకి వచ్చింది షెఫాలీ. ప్రస్తుతం ఆమె స్థానంలో ఆడుతోంది. గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్​తో అంతర్జాతీయ మ్యాచ్​ల్లో అరంగేట్రం చేసింది.

ఇదీ చదవండి: ప్రపంచ పారా అథ్లెట్​ ఛాంపియన్​షిప్​లో భారత్​కు స్వర్ణం

Intro:अजमेर-मशहूर अभिनेत्री काजल अग्रवाल ने दरगाह में चादर औऱ फूल पेश किए उनकी माँ भी साथ में मौजूद रही ,अजमेर व किशनगड़ में चल रही फ़िल्म इंडियन 2 की शूटिंग में कई जाने माने कलाकार आए है जिनकी एक झलक देखने के लिए बेताब रहे , इंडियन 2 के डायरेक्टर शंकर हैं जो काफी लोकप्रिय है उनकी पहली की फ़िल्म नायक , रजनीकांत की रोबोट , अक्षय कुमार की रोबोट 2 काफी चर्चित रही हैं

1996 में आई फ़िल्म हिदुस्तानी फ़िल्म का दूसरा पार्ट हैं इंडियन 2 फ़िल्म ख़ासकर कर कमल हासन ने काफ़ी बुजुर्ग आदमी का रोल निभाया
किशनगड़ में फूल महल के आस पास गलियों में शूटिंग चल रही हैं

यह सभी शूटिंग प्रबंधन अजमेर लाइन के निर्माता अक्षय सिंह रावत व और उनकी प्रोडक्शन टीम नज़ीर क़ादरी , देवेंद्र दया , सिद्धार्थ महात्मा, जय , संजना राठौड़ और शुभम शुक्ला द्वारा की गई है।
अभिनेत्री काजल अग्रवाल शूटिंग से फ़्री होने पर अपनी मां के साथ सूफ़ी सन्त ख्वाजा मोईनुद्दीन चिश्ती की दरगाह में मखमली चादर ओर अकीदत के फूल पेश किए आने वाली फिल्मों की कामयाबी की दुआ मांगी

अभिनेत्री काजल अग्रवाल को जियारत ख़ादिम सैयद विलायत हुसैन ने कराई औऱ ओढ़नी ओढ़ाई औऱ तबरूक दिया ओर सभी के लिए दुआ की
काजल अग्रवाल की 'स्पेशल 26' , और 'दो लफ्जों की कहानी' , सिंघल , कैदी नम्बर 150 , सरदार गब्बर सिंह , वीरा , सरोजा , डार्लिंग , मगधीरा , मुम्बई सांगा , बिजनेस मैन , सीता , चन्दा मामा , बिजनेस मैन , आर्य 2 , जिल्ला , बादशाह , मिस्टर परफेट , फ़ायनल कट , कोमली , मर्सेल , पेरिस पेरिस , सहित कई फिल्मों में काम कियाBody:अजमेरConclusion:अजमेर
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.