వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ టెయిలెండర్స్‌ను ప్రారంభంలోనే పెవిలియన్‌కు చేర్చాల్సిందని టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అన్నాడు.
"కొన్నిసార్లు ప్రత్యర్థి జట్టును తొందరగా ఆలౌట్ చేయడంపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఇప్పుడు మేం దృష్టి సారించట్లేదని కాదు. అయితే కివీస్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడారు. జేమీసన్, బౌల్ట్ చక్కగా ఆడారు. జేమీసన్‌కు ఫస్ట్‌క్లాస్‌లో శతకాలు సాధించిన అనుభవముంది. అయితే క్రెడిట్ మొత్తం కివీస్ బ్యాట్స్‌మెన్‌దే. అక్కడి పరిస్థితులను వారు బాగా అర్థం చేసుకున్నారు" -అశ్విన్, భారత బౌలర్
తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ లోయరార్డర్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడారు. కివీస్.. 125 పరుగుల వ్యవధిలో చివరి 3 వికెట్లు కోల్పోయింది. బౌలర్లు జేమీసన్ (44), ట్రెంట్ బౌల్ట్ (38) రాణించారు.
కివీస్‌కు ఎంత లక్ష్యాన్ని నిర్దేశించాలనే ఆలోచనతో కాకుండా, సెషన్ల వారీగా మంచి ప్రదర్శన చేయాలనే ప్రణాళికతో నాలుగో రోజు ఆట ఆడాలని అశ్విన్ అన్నాడు.
"తొలిరోజు మాదిరిగా పిచ్ ఇప్పడు లేప్పటికీ కివీస్ బౌలర్లు చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఒత్తిడిలోకి నెడుతున్నారు. అసలైన టెస్టు ఇప్పుడే మొదలైంది. వారు ఇప్పటికే 65 ఓవర్లు బౌలింగ్ చేశారు. రేపు బౌలింగ్ ఎలా చేస్తారో చూడాలి. అయితే రేపటి తొలి సెషన్‌లో వికెట్ పడకుండా మేం జాగ్రత్తగా ఆడాలి: -అశ్విన్, భారత బౌలర్
మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. కివీస్ కంటే ఇంకా 39 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన.. 165 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 348 పరుగుల చేసింది.