బాల్ టాంపరింగ్‌తో ఏడాది నిషేధాన్ని ఎదుర్కొన్నాడు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్. అనంతరం ప్రపంచకప్ బరిలో నిలిచాడు. శనివారం ఇంగ్లాండ్‌తో ప్రాక్టీసు మ్యాచ్‌లో అదరగొట్టాడు. నిషేధానికి గురైన సమయంలో సామాజిక సేవ, ఆత్మ పరిశీలన చేసుకోవడమే తనని మరింత దృఢంగా తయారు చేశాయని చెప్పాడు.
"ఇంతకు ముందు చేయని కొన్ని పనుల్ని ఈ ఏడాదిలో చేశాను. మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాను. అవి నన్ను మనిషిగా మరింత దృఢంగా మార్చాయి. వరుసగా కొన్నేళ్లపాటు క్రికెట్ ఆడుతున్నా, అలాంటిది సంవత్సరం పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ విషయం బాగా ఆడాలనే పట్టుదలను పెంచింది." -స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా క్రికెటర్
ఈ జనవరిలో స్మిత్ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. అయినా అది తన బ్యాటింగ్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేదని చెప్పాడీ కంగారూ బ్యాట్స్‌మెన్.
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో గెలిచింది ఆసిస్ జట్టు. స్మిత్ 116, వార్నర్ 43 పరుగులు చేసి పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నారు.
ఇది చదవండి: 'మోసగాడా వెళ్లిపో'- వార్నర్, స్మిత్‌కు చేదు అనుభవం