భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించగా.. ఆ అమర జవాన్ల పిల్లలకు సహాయం చేస్తానని ఇంతకు ముందే తెలిపాడు. ప్రస్తుతం 'అంతర్జాతీయ స్కూల్'లో కొంతమంది జవాన్ల పిల్లలు క్రికెట్ శిక్షణ పొందుతున్న దృశ్యాలను తాజాగా సెహ్వాగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ నెట్టింట సందడి చేస్తోంది. నెటిజన్లు సెహ్వాగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
-
Son of Heroes !
— Virender Sehwag (@virendersehwag) October 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
What a privilege to be able to have these two at @SehwagSchool and have the fortune to contribute to their lives.
Batsman - Arpit Singh s/o Pulwama Shaheed Ram Vakeel &
Bowler- Rahul Soreng s/o Pulwama Shaheed Vijay Soreng.
Few things can beat this happiness ! pic.twitter.com/Z7Yl4thaHd
">Son of Heroes !
— Virender Sehwag (@virendersehwag) October 16, 2019

Few things can beat this happiness ! pic.twitter.com/Z7Yl4thaHdSon of Heroes !
— Virender Sehwag (@virendersehwag) October 16, 2019
What a privilege to be able to have these two at @SehwagSchool and have the fortune to contribute to their lives.
Batsman - Arpit Singh s/o Pulwama Shaheed Ram Vakeel &
Bowler- Rahul Soreng s/o Pulwama Shaheed Vijay Soreng.
Few things can beat this happiness ! pic.twitter.com/Z7Yl4thaHd
"నా పాఠశాలలో ఈ చిన్నారులకు సేవలు అందించడం ఎంతో గొప్పగా భావిస్తున్నా. వీరంతా భారత అమర వీరుల బిడ్డలు. బ్యాటింగ్ చేస్తోన్న వ్యక్తి అర్పిత్ సింగ్ పుల్వామా అమర జవాన్ రామ్ వకీల్ కుమారుడు, బౌలర్ రాహుల్ సోరెంగ్ అమర జవాన్ విజయ్ సోరెంగ్ కుమారుడు. ఇంతకన్నా ఆనందాన్నిచ్చే పనులు ఉంటాయా..!"
-సెహ్వాగ్, టీమిండియా మాజీ ఆటగాడు
సెహ్వాగ్ చేసిన ఈ ట్వీట్‌పై అభిమానులతో పాటు నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. "దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరులకు ఎంతో కొంత తిరిగి ఇవ్వడం మన విధి మీరు గొప్ప వారు సర్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవీ చూడండి.. భారత్ మూడో టెస్టు కోసం సైనికులకు ఉచిత టికెట్లు