ETV Bharat / sports

'సెహ్వాగ్ లెఫ్ట్‌హ్యాండ్‌తో ఆడినట్లు ఉంది' - రిషబ్ పంత్

టీమ్​ఇండియా యువ సంచలనం రిషబ్ పంత్‌ను ఉద్దేశించి చాలాకాలం తర్వాత ఒత్తిడి లేకుండా ఆడుతున్న బ్యాట్స్‌మన్‌ను చూశానని అన్నాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్. అతడిని చూస్తుంటే సెహ్వగా లెఫ్ట్​హ్యాండ్​తో ఆడినట్లు ఉందని ప్రశంసించాడు.

'Sehwag seems to have played with left hand' says inzamam while praising rishabh pant
'సెహ్వాగ్ లెఫ్ట్‌హ్యాండ్‌తో ఆడినట్లు ఉంది'
author img

By

Published : Mar 8, 2021, 10:35 PM IST

టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ రిషబ్ పంత్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఎడమ చేతితో ఆడుతున్నట్లు అనిపించిందని పాక్‌ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ప్రశంసించాడు. పంత్‌ బ్యాటింగ్‌ అద్భుతంగా ఉందని, చాలాకాలం తర్వాత ఒత్తిడి లేకుండా ఆడుతున్న బ్యాట్స్‌మన్‌ను చూశానని చెప్పాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో పంత్‌(101) శతకం చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ సారథి పంత్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. తన యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"రిషబ్​ ‌పంత్‌ అద్భుతంగా ఆడాడు. చాలాకాలం తర్వాత ఒత్తిడే ఎరుగని బ్యాట్స్‌మన్‌ను చూశాను. 146 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన స్థితిలోనూ అతడిలా ఎవరూ ఆడలేరు. పిచ్‌ ఎలా ఉన్నా.. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా తన సహజసిద్ధమైన ఆటను ఆడగలడు. ఫాస్ట్‌ బౌలర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా చూస్తాడు. అతడి ఆటను పూర్తిగా ఆస్వాదించాను. ఆ బ్యాటింగ్‌ చూస్తుంటే సెహ్వాగ్‌ ఎడమ చేతితో ఆడుతున్నట్లు అనిపించింది. నేను సెహ్వాగ్‌తో ఆడాను. అతడు కూడా పరిస్థితుల గురించి ఆలోచించకుండా ఆడతాడు. వీరూ బ్యాటింగ్‌ చేస్తుంటే పిచ్‌ ఎలా ఉంది. ప్రత్యర్థులు ఎవరనేవి లెక్కలోకి రావు. బంతిని దంచికొట్టడమే పనిగా పెట్టుకుంటాడు. బౌండరీ వద్ద ఫీల్డర్లు ఉన్నా అలాగే ఆడతాడు. సెహ్వాగ్‌ తర్వాత అతడిలాంటి బ్యాట్స్‌మన్‌ను పంత్‌నే చూశాను. అతడు భారత్‌లోనే కాకుండా ఆస్ట్రేలియాలోనూ రాణించాడు. అతడికున్న ఆత్మవిశ్వాసం నమ్మశక్యం కానిది. నా క్రికెట్‌ జీవితంలో ఇలాంటి ఆటగాడిని చూడలేదు" అని పాక్ మాజీ సారథి కొనియాడాడు.

ఇదీ చూడండి: కూతురి ఫొటోతో కోహ్లీ భావోద్వేగ పోస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.