ఆస్ట్రేలియా జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. డిసెంబరు 17న భారత్‌తో జరగబోయే తొలి(డే నైట్)టెస్టుకు ఆ జట్టు పేసర్ సీన్ అబాట్ దూరమయ్యాడు. డిసెంబరు 12న సిడ్నీ వేదికగా భారత్-ఎ, ఆసీస్-ఎ మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతడికి తగిలిన గాయం తీవ్రత ఎక్కువవ్వడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అతడి స్థానంలో హెన్రిక్స్‌ను తీసుకున్నట్లు వెల్లడించింది.
డిసెంబరు 17వ తేదీ నుంచి టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. డిసెంబర్ 17-21 వరకు అడిలైడ్‌లో తొలి మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత టెస్టులకు మెల్‌బోర్న్ (26-30), సిడ్నీ (జనవరి 7-11, 2021), బ్రిస్బేన్ (జనవరి 15-19) ఆతిథ్యమిస్తాయి.
ఇదీ చూడండి : భారత్‌తో తొలి టెస్టుకు వార్నర్ దూరం