ETV Bharat / sports

ప్రపంచంలో ఏ జట్టునైనా సరే ఓడిస్తాం: బెన్​స్టోక్స్​ - దక్షిణాఫ్రికా వర్సెస్​ ఇంగ్లాండ్​ టీ20 సిరీస్​ వార్తలు

ప్రస్తుతం ఎలాంటి జట్టునైనా ఇంగ్లాండ్​ అవలీలగా ఓడిస్తుందని ఆ జట్టు ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​ అన్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్​ను వైట్​వాష్ చేసిన నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశాడు.

Scary to think where this England team can go: Ben Stokes
ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడించగలం: బెన్​స్టోక్స్​
author img

By

Published : Dec 3, 2020, 10:27 PM IST

దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్​ ఇంగ్లాండ్​ క్లీన్​స్వీప్ చేయడంపై బెన్​ స్టోక్స్ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోని ఎంతటి బలమైనా జట్టునైనా సరే తాము ఓడించగలమని ధీమా వ్యక్తం చేశాడు. ఇది అహంకారంతో చెబుతున్న మాటలు కాదని అన్నాడు. ​

"మా సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆటమీద ఎక్కువ దృష్టి సారించి.. ప్రత్యర్థి బలాలు, బలహీనతలను అంచనా వేసుకుంటాం. ఆ తర్వాత ఆట మెరుగుపరచుకుని ఒత్తిడి లేకుండా చేసుకుంటాం. మ్యాచ్​లో బాగా ఆడుతున్నామా? లేదా? అనే విషయం మాకు తెలుస్తుంది. ప్రపంచలోని చాలా జట్లను ఓడించగలం. ఇది అహంకారం కాదు. మా జట్టుపై ఉన్న నమ్మకం. ఇలాంటి జట్టులో భాగం కావడం ఎంతో ఉత్సాహంగా ఉంది. కొందరు క్రికెటర్లు తక్కువ సమయంలోనే తిరిగి ఫామ్​ అందుకోవడం చాలా ఆనందమైన విషయం"

- బెన్​ స్టోక్స్​, ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​

తొలి మ్యాచ్​లో ఐదు వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్​లో నాలుగు వికెట్ల తేడాతో, మూడో టీ20లో 9 వికెట్ల తేడాతో సఫారీలపై ఇంగ్లాండ్​ విజయం సాధించింది. శుక్రవారం(డిసెంబరు 4) నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్​ ప్రారంభం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.