యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి స్టీవ్ స్మిత్‌కు తగలకుండా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో! బ్రాడ్‌మన్ అత్యధిక పరుగుల(974) రికార్డునూ స్మిత్ బద్దలు కొట్టేవాడేమో! ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. అయితే స్మిత్ మాత్రం జోఫ్రా ఆర్చర్‌ను పొగడ్తలతో ముంచెత్త్తుతున్నాడు. ఆర్చర్‌కు ప్రత్యేకమైన టాలెంట్ ఉందని ఆదివారం ఆఖరి టెస్టు అనంతరం చెప్పాడు.
"గత ఏడాది ఐపీఎల్లో తొలిసారి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చూశా. ప్రత్యేకమైన టాలెంట్ అతడి సొంతం. ఆర్చర్‌కు మంచి భవిష్యత్తు ఉంది" -స్టీవ్ స్మిత్, ఆసీస్ క్రికెటర్.
ఇంగ్లీష్ బౌలర్ అండర్సన్ గైర్హాజరుతో జట్టులో చోటు దక్కించుకున్నాడు జోఫ్రా ఆర్చర్. ఇప్పటికే ప్రపంచకప్‌లో సత్తాచాటిన ఆర్చర్.. టెస్టు ఫార్మాట్లోనూ ఆకట్టుకున్నాడు. 22 వికెట్లతో ఈ యాషెస్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు ప్యాట్ కమిన్స్(26), స్టువర్ట్ బ్రాడ్(23) ఉన్నారు.
ఈ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ ఏడు ఇన్నింగ్స్‌లు ఆడి 110.57 సగటుతో 774 పరుగులు చేశాడు. ఈ మిలీనియంలో ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. యాషెస్ సిరీస్ 2-2 తేడాతో డ్రాగా ముగిసింది.
ఇదీ చదవండి: 47 ఏళ్ల తర్వాత యాషెస్ సిరీస్ డ్రా