ETV Bharat / sports

సర్ఫరాజ్​ టెస్టు కెరీర్​ ముగిసింది: రమీజ్ రాజా - రమీజ్ రాజా

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్​ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్​కు చోటు దక్కలేదు. దీంతో అతడి టెస్టు కెరీర్ ముగిసిపోయిందని అభిప్రాయపడ్డాడు పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా. త్వరలోనే అతడు టెస్టు క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాలని తెలిపాడు.

సర్ఫరాజ్​ టెస్టు కెరీర్​ ముగిసింది: రమీజ్ రాజా

author img

By

Published : Aug 11, 2020, 5:38 PM IST

గతేడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ క్రికెటర్ సర్ఫరాజ్​ అహ్మద్​ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది పీసీబీ. అన్ని ఫార్మాట్లకు కొత్త కెప్టెన్​లను నియమించింది. అయితే జట్టులోకి తీసుకోవడంలోనూ ఆలోచనలో పడింది. తాజాగా ఇంగ్లాండ్​తో జరుగుతోన్న టెస్టు సిరీస్​కు సర్ఫరాజ్ అహ్మద్​ ఎంపికైనా తుది జట్టులో మాత్రం చోటు కష్టంగానే మారింది. ఇంగ్లీష్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో 12వ ఆటగాడిగా సహచర ఆటగాళ్లకు కూల్​డ్రింక్స్ అందిస్తూ కనిపించాడీ మాజీ కెప్టెన్. తాజాగా ఈ విషయమై స్పందించాడు పాక్ మాజీ సారథి రమీజ్ రాజా.

"సర్పరాజ్ వీలైనంత త్వరగా టెస్టు క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించి పూర్తి దృష్టి పరిమిత ఓవర్ల సిరీస్​లపై కేటాయించాలి. ఎందుకంటే ఈ ఫార్మాట్​లో అతడు బాగా రాణించగలడు. ఇదే నేను అతడికిచ్చే సలహా. సహచర ఆటగాళ్లకు కూల్​డ్రింక్స్ అందించడంలో తప్పులేదు. ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్ కూడా వెస్టిండీస్​తో జరిగిన రెండో టెస్టులో అదే పని చేశాడు. అయితే ఓ మాజీ కెప్టెన్ ఇటువంటి పనులు చేయడాన్ని మనం తప్పుగా చూస్తాం. నాకు తెలిసి సర్ఫరాజ్​కు ఇక టెస్టుల్లో చోటు దక్కదు."

-రమీజ్ రాజా, పాకిస్థాన్ మాజీ కెప్టెన్

సర్ఫరాజ్​ తన కెరీర్​లో 49 టెస్టులు, 116 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. అలాగే 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్​ను విజేతగా నిలిపాడు. ఈ టోర్నీ ఫైనల్లో భారత్​పై గెలిచింది పాక్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.