వివాదాస్పద క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌ను కామెంట్రీ ప్యానెల్ నుంచి తప్పించింది బీసీసీఐ. తాజాగా ఈ విషయంపై స్వయంగా మంజ్రేకర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
" కామెంట్రీని నా అర్హతగా, నాకు దక్కిన గౌరవంగా భావించాను. కానీ నన్ను ఎంపిక చేయాలా? వద్దా అనేది నా యజమానులు తీసుకొనే నిర్ణయం. దాన్ని నేను గౌరవిస్తాను. బీసీసీఐ నా పనితీరుతో సంతృప్తి చెందలేదు అనుకుంటున్నాను. దీన్ని వృత్తి ధర్మంగా అంగీకరిస్తున్నాను."
- సంజయ్ మంజ్రేకర్, ప్రముఖ వ్యాఖ్యాత
దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది. కరోనా వైరస్ కారణంగా పూర్తి సిరీస్‌నీ రద్దు చేశారు. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్.. ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా పడింది.
చెన్నై సూపర్‌కింగ్స్ ట్రోలింగ్..
సంజయ్ మంజ్రేకర్‌ను బీసీసీఐ కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగించిందని సమాచారం రాగానే చెన్నై సూపర్ కింగ్స్ స్పందించింది. ఇకపై "బిట్స్ అండ్ పీసెస్" గొంతు వినాల్సిన పనిలేదని మంజ్రేకర్‌ను ఉద్దేశించి ట్రోల్ చేసింది.
-
Need not hear the audio feed in bits and pieces anymore. 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) March 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Need not hear the audio feed in bits and pieces anymore. 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) March 14, 2020Need not hear the audio feed in bits and pieces anymore. 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) March 14, 2020
గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ సందర్భంగా మంజ్రేకర్ ఓ టీవీ షోలో మాట్లాడుతూ చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజాపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జడ్డూ వంటి " బిట్స్ అండ్ పీసెస్" క్రికెటర్లకు అభిమానిని కాదన్నాడు. ఈ విషయంపై అప్పట్లో నెటిజన్లు అతడిని ఓ ఆట ఆడుకున్నారు. ఆ సమయంలో జడేజా సైతం తనదైన శైలిలో ఘాటుగా స్పందించాడు. " నీ కన్నా రెండింతలు ఎక్కువ మ్యాచ్‌లు ఆడాను. ఇంకా ఆడుతున్నాను. ఇతరులను గౌరవించడం నేర్చుకో. నీ నోటి దురుసు గురించి చాలా విన్నా" అని జడ్డూ ట్వీట్ చేశాడు.
వన్డే ప్రపంచకప్ సెమీస్ ఫైనల్లో జడేజా కివీస్‌పై అద్భుతంగా పోరాడి మంజ్రేకర్ వ్యాఖ్యలు తప్పని నిరూపించాడు. అప్పుడ మంజ్రేకర్ క్షమాపణలు చెప్పాడు. తర్వాత పలు సందర్భాల్లో మంజ్రేకర్.. హర్షా భోగ్లే, ధోనీ, సానియా మీర్జా, విండీస్ క్రికెటర్ కీరన్ పోలార్డ్‌లను ఇలాగే అవమానించే ప్రయత్నం చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.