బెంగళూరు - ముంబయి మ్యాచ్‌లో నోబాల్‌ను గుర్తించడంలోఅంపైర్ సుందరం రవి విఫలమయ్యారు. అయితే ఆ మ్యాచ్ అంపైర్లు రవి, నందన్లపై ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
"ఐపీఎల్ కోసం కేవలం 17 మంది అంపైర్లు మాత్రమే ఉన్నారు. అందులో 11 మంది భారతీయులు, ఆరుగురు విదేశీయులు. వీరు కాకుండా మరో ఆరుగురు నాలుగో అంపైర్‌గా ఉన్నారు"
-బీసీసీఐ అధికారి
ఐసీసీ ఎలైట్ ప్యానల్లో ఉన్న ఏకైక భారతీయ అంపైర్ రవి. మరో అంపైర్ నందన్... రెండేళ్ల క్రితం బీసీసీఐ నుంచి ఉత్తమ అంపైర్ అవార్డు గెలుచుకున్నాడు. వీరిద్దరూ బెంగళూరు - ముంబయి మ్యాచ్‌లో నోబాల్‌ని గుర్తించకపోవడం పట్ల క్రీడాభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ నుంచి అంపైర్ రవి, నందన్లని పక్కనపెడతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంపైర్ రవిపై మ్యాచ్ రిఫరీ నుంచి నెగటివ్ మార్కింగ్ పొందొచ్చు. కానీ ఐపీఎల్ మ్యాచ్‌ల నుంచి నిషేధం విధించే అవకాశం లేదని బీసీసీఐ అధికారి తెలిపారు.