ఇంగ్లాండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ నాయకత్వంలో ఆడాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ లీగ్‌లో తన సోదరుడు టామ్‌ను ఔట్ చేయాలని కోరుకుంటున్నాడు.
'ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందా? లేదా? అనేది ఎవరికీ స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సూచనలను పాటించాల్సిన అవసరముంది. ఫ్రాంఛైజీ మారడం వల్ల సీఎస్కే తరఫున ఆడేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. చెన్నై జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. నాకు వారు ఇవ్వబోయే సలహాల కోసం ఎదురుచూస్తున్నా' -సామ్ కరన్, ఇంగ్లీష్ క్రికెటర్
గత సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను ఐపీఎల్ వేలంలో రూ.5.5 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీ.. కరోనా ప్రభావంతో ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. అయితే భారత్ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో లీగ్‌ను నిరవధిక వాయిదా వేశారు.