ధోనీ గైర్హాజరుతో జట్టులో చోటు దక్కించుకున్న యువ వికెట్ కీపర్ పంత్ వరుసగా విఫలమవడం ఆందోళన కలిగిస్తోంది. టీ20, వన్డే సిరీస్‌లతో పాటు మొదటి టెస్టులోనూ నిరాశపర్చాడు పంత్. ఫలితంగా రెండో టెస్టులో ఈ ఆటగాడి స్థానంలో మరో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను ఆడించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రిషభ్ పంత్ స్థానంలో వృద్ధిమాన్ సాహాను ఆడించాలని కోరుతున్నాడు భారత మాజీ కీపర్ సయ్యర్ కిర్మాణీ.
"పంత్ గొప్ప ప్రతిభావంతుడు. కానీ ఇంకా ఎదిగే దశలోనే ఉన్నాడు. సాహాను దురదృష్టవశాత్తు గాయాలు వెంటాడాయి. అతడికీ సమానావకాశాలు దక్కాలి. ఛాన్స్ ఇవ్వకుండా జట్టులో కొనసాగించడంలో ఆంతర్యమేంటి ?"
-సయ్యద్ కిర్మాణీ, భారత మాజీ ఆటగాడు
మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్‌పైనా స్పందించాడు కిర్మాణీ. రిటైర్మెంట్ విషయాన్ని అతడికే వదిలేయాలని కోరాడు. ఎప్పుడు వీడ్కోలు పలకాలో ధోనీకి తెలుసని తెలిపాడు.
ప్రస్తుతం టీమిండియా.. వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు గెలిచిన కోహ్లీసేన తొలి టెస్టు విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో బోణీ కొట్టింది.
ఇవీ చూడండి.. టెస్టు ర్యాంకింగ్స్: కోహ్లీ నెం 1, బుమ్రా@7