ETV Bharat / sports

మీరే మీ పిల్లలకు హీరోలు: సచిన్ తెందుల్కర్ - Sachin Tendulkar latest news

లాక్​డౌన్​ పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడి విషయమై, వారి తల్లిదండ్రులకు సచిన్ కొన్ని సూచనలు చేశాడు. ధైర్యంగా ఉంటూ, ఆ చిన్నారుల్లో ధైర్యాన్ని నింపాలని చెప్పాడు. వారితో అనుబంధాన్ని పెంచుకునే సమయం కరోనా మనకిచ్చిందని పేర్కొన్నాడు.

మీరే మీ పిల్లలకు హీరోలు: సచిన్ తెందుల్కర్
క్రికెటర్ సచిన్ తెందుల్కర్
author img

By

Published : Aug 15, 2020, 6:25 AM IST

పిల్లల మనసులు సున్నితమైనవి. బాల్యంలో ఎదుర్కొనే పరిస్థితులు వాళ్ల భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరిలో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఈ ప్రభావాన్ని ఆ చిన్నారుల హృదయాలపై పడనీయకుండా కాపు కాసే బాధ్యత తల్లిదండ్రులదేనని అంటున్నాడు దిగ్గజ క్రికెటర్ సచిన్‌ తెందుల్కర్‌. వాళ్లలో ధైర్యాన్ని నూరిపోసి, కష్టాలను దూరం చేసే హీరోలుగా అమ్మానాన్నలు ఉండాలని సూచిస్తూ రాసిన ఈ వ్యాసం 'ఈనాడు'కు ప్రత్యేకం.

నా హృదయాన్ని తాకే చిన్ననాటి జ్ఞాపకం ఏదైనా ఉంది అంటే.. అది కుటుంబంతో కలిసి టీవీ చూస్తున్నపుడు అందులో హింసాత్మకమైనా లేదా అసభ్యకరమైన సన్నివేశం వచ్చినపుడు మా అమ్మ నా కళ్లు మూసేది. దీంతో అదేంటో చూడాలనే ఉత్సుకత మరింత పెరిగేది. అమ్మ చేతిని తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యేవాణ్ని. తమ పిల్లలకు హాని చేసే విషయాల నుంచి వాళ్లను కాపాడేందుకు తల్లిదండ్రులకు ఉండే సహజ గుణమది. పిల్లల ఆరంభ అనుభవాలు వారి ఎదుగుదలను నిర్దేశిస్తాయని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా తొలి ఆరేళ్ల వయసులో మెదడు ఎదుగుదల వేగంగా ఉండి.. మనిషి ఎంత సంతోషంగా, ఆరోగ్యవంతంగా పెరుగుతాడనే విషయంపై ప్రభావం చూపిస్తుందనేది వాస్తవం. తాజా పరిశోధనల ప్రకారం పసితనంలో ప్రతికూల ఉద్వేగాలు పిల్లాడి మానసిక వృద్ధిపై ప్రభావం చూపిస్తాయన్నది స్పష్టం.

పిల్లలపై పడనివ్వకండి

కరోనాతో మూతపడిన పాఠశాలలు, ఊడిన ఉద్యోగాలు, స్తంభించిన జీవనం, తగ్గిన ఆదాయం, ఇంటి నుంచి పని చేయడం లాంటి పరిణామాలతో కలిగే భయం, సందిగ్ధత నిండిన ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులతో సహా అందరూ ఒత్తిడికి గురవుతున్నారు.

అయినా ఈ సమయంలో పిల్లలను సరైన దిశలో నడపాల్సిన అదనపు బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. వాళ్లు సవాళ్లకు ఎదురొడ్డి నిలిచి.. ఒత్తిడి, భయం తదితర ప్రతికూల ప్రభావాలు పిల్లలపై పడకుండా కాపాడాలి. సానుకూల దృక్పథంతో పిల్లలను పెంచడం ఇప్పుడు ఆవశ్యకం. పిల్లలతో దగ్గరగా ఉంటూ వారిలో సానుకూల దృక్పథాన్ని అలవర్చి, మనోవికాసాన్ని పెంపొందించి.. ప్రస్తుత సంక్షోభ సమయంలో మరింత దృఢంగా నిలబడేలా చేయడం మన బాధ్యత. పిల్లలతో కఠినంగా వ్యవహరించే నియంతల్లా కాకుండా.. కలివిడిగా ఉంటూ, మార్గనిర్దేశకులుగా వ్యవహరిస్తూ వారితో అనుబంధాన్ని పెంచుకునే అవకాశాన్ని కరోనా మహమ్మారి మనకిచ్చింది. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. తమ భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛనివ్వాలి.

ఒక్క క్షణం ఆగాలి

పిల్లలు చెడుగా ప్రవర్తిస్తే వెంటనే కోపం చూపించకుండా ఓ క్షణం ఆగి ఆలోచించాలి. ప్రస్తుత పరిస్థితుల వల్ల కలిగిన భయం, ఒత్తిడి లేదా ఆందోళన వల్ల వాళ్లు అలా ప్రవర్తిస్తున్నారేమో! మరో విధంగా తమ భావాలను బయటపెట్టలేక అలా చేస్తుండొచ్చు. కాబట్టి పిల్లలను తిట్టడం, కొట్టడం చేయొద్దు. కొవిడ్‌-19 గురించి పిల్లలకున్న సందేహాలకు.. అర్థమయ్యే విధంగా సమాధానాలు చెప్పాలి. వాళ్లకు ఎలాంటి సందేహాలు లేకున్నా ప్రస్తుత పరిస్థితిని వివరించాలి. అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారంటే వాళ్లు భరోసా కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. ఓపికగా ఉండాలి. వాళ్లడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియకుంటే తెలుసుకోవాలి. లక్షల మంది తల్లిదండ్రులు ఆందోళనకర స్థితిలో ఉన్నారిప్పుడు. అయితే తమ పిల్లలకు అండగా నిలిచే క్రమంలో మీరు కూడా జాగ్రత్తగా ఉండడం మర్చిపోవద్దు. మీరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగితే అదే పిల్లలకిచ్చే విలువైన బహుమతి. ఓపికతో వినడం, ఓదార్పు నిండిన స్పర్శ, ప్రేమతో కూడిన కౌగిలింత, సున్నితమైన ముద్దు.. ఇవన్నీ మీ పిల్లలు బలవంతులుగా ఎదిగేందుకు, ఒకరికొకరు సహకరించుకునే మంచి మనుషులుగా తయారయ్యేందుకు సాయపడతాయి. నాన్న, అమ్మతో పాటు కుటుంబ సభ్యులు ఇచ్చే భరోసా కోసం పిల్లలు ఇప్పటికీ మనవైపు చూస్తున్నారు. బయట ప్రపంచం ఎలా ఉన్నప్పటికీ పిల్లలకు వాళ్ల తల్లిదండ్రులే ప్రతి రోజూ కనిపించే హీరోలు. మనం హీరోల్లా కనిపించే వస్త్రాలు ధరించకపోయినా.. పిల్లల కోసం ప్రతి రోజూ, ప్రతి మార్గంలో ఆ స్థానంలోనే ఉందాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.