మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్‌కు స్టైయిట్ డ్రైవ్ అంటే చాలా ఇష్టమని గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అలానే ముంబయి ఫేమస్ 'వడా పావ్' అన్నా సరే అంతే ఇష్టమని వెల్లడించాడు. ఆ ఇష్టాన్ని పొగొట్టుకోలేక, ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లి తినలేక ఆదివారం తన ఇంట్లోనే దానిని తయారు చేసుకున్నాడు. మాస్టర్ వంట చేసే సమయంలో అనుకోని అతిథి ఒకరు తన ఇంటికి వచ్చారని ఇన్‌స్టాలో తెలిపాడు. ఆ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"నేను బాగా ఇష్టపడే చిరుతిళ్లలో వడా పావ్ ఎంతో ప్రత్యేకం. దాన్ని తయారు చేస్తున్నప్పుడు అనుకోని అతిథి వచ్చారు. అతడికి దీన్ని తినాలని అనిపించింది. ఆ సందర్శకుడే పిల్లి"
- సచిన్ తెందూల్కర్ ఇన్‌స్టా పోస్ట్
ఈ పోస్ట్‌పై స్పందించిన సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. తనకోసం మరో 'వడాపావ్' తయారు చేయమని కామెంట్ చేశాడు.
లాక్‌డౌన్‌తో దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న సచిన్.. పలు వంటలు చేస్తూ సమయాన్ని ఆస్వాదించాడు. మేలో తన పెళ్లి రోజు సందర్భంగా, స్వయంగా స్వీట్ తయారు చేసి కుటుంబ సభ్యుల్ని ఆశ్చర్యపరిచాడు.