దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ కోసం ఆ దేశంలో అడుగుపెట్టింది ఆస్ట్రేలియా. సఫారీ జట్టుతో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్.. 107 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించని స్మిత్.. మళ్లీ విమర్శలపాలయ్యాడు.
ఏమైందంటే?
జోహెన్స్‌బర్గ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సఫారీ బౌలర్ స్టెయిన్ వేసిన మూడో ఓవర్లో ఓ సంఘటన జరిగింది. స్టెయిన్ బౌలింగ్ వేసే క్రమంలో చేతిలో నుంచి జారిన బంతి డెడ్ బాల్ రూపంలో బ్యాట్స్‌మన్ వద్దకు వెళ్లింది. ఆ బంతిని కొట్టకుండా అడ్డుకోవాల్సిన స్మిత్.. ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి బౌండరీ తరలించాడు. అంపైర్ డెడ్ బాల్‌గా ప్రకటించినా స్మిత్ పట్టించుకోలేదని, కనీసం క్రీడాస్ఫూర్తి ప్రదర్శించలేదని స్మిత్‌పై అసహనం వ్యక్తం చేశారు ఆతిథ్య జట్టు అభిమానులు. కొందరూ 'సాండ్‌పేపర్ ఫర్ సేల్' అంటూ తను గతంలో చేసిన బాల్ ట్యాంపరింగ్‌ను గుర్తు చేస్తూ పోస్టుర్లు ప్రదర్శించారు.
-
DALE STEYN #SAvsAUS pic.twitter.com/Kn4tuQ19ic
— dilse FAN (@iemSRKian) February 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">DALE STEYN #SAvsAUS pic.twitter.com/Kn4tuQ19ic
— dilse FAN (@iemSRKian) February 21, 2020DALE STEYN #SAvsAUS pic.twitter.com/Kn4tuQ19ic
— dilse FAN (@iemSRKian) February 21, 2020
తలదించుకున్న గడ్డపైనే
2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన స్మిత్... బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అనంతరం ఏడాది నిషేధం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు. అప్పట్నుంచి తనదైన ఫామ్‌తో రాణిస్తున్నాడు. ఇప్పుడు జరిగిన తొలి టీ20లో తన జట్టును గెలిపించాడు. 45 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 89 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్.. 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కంగారూ బౌలర్ అగర్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ నాలుగో బంతికి డుప్లెసిస్‌ను ఔట్ చేసిన అగర్.. ఆ తర్వాత వరుస బంతుల్లో ఫెలుక్వాయో, స్టెయిన్‌లను పెవిలియన్ చేర్చాడు.