ETV Bharat / sports

ఆండ్రూ రసెల్.. టీ20ల్లో మైకేల్​ జోర్డాన్​! - west indies cricketer andre rassel news

విండీస్​ స్టార్ ఆల్​రౌండర్ రసెల్​ను దిగ్గజ మైకేల్ జోర్డాన్​తో పోల్చారు కోల్​కతా నైట్​ రైడర్స్​ సీఈఓ. టీ20ల్లో అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన ఆటగాడు రసెల్​ అని ప్రశంసించారు.

'Dre Russ is the Michael Jordan of T20 cricket': Mysore heaps praise on KKR all-rounder
రస్సెల్​
author img

By

Published : Jul 28, 2020, 10:45 AM IST

వెస్టిండీస్​ ఆల్​రౌండర్​ ఆండ్రీ రసెల్..​ టీ20ల్లో అద్భుత నైపుణ్యాలున్న ఆటగాడని ప్రశంసించారు కోల్​కతా నైట్​రైడర్స్ సీఈఓ వెంకీ మైసూర్​. ఈ క్రమంలో రసెల్​ను మైకేల్​ జోర్డాన్​తో పోల్చారు. ఐపీఎల్ గత సీజన్​లో 14 మ్యాచ్​లాడి 56.66 సగటుతో 510 పరుగులు చేశాడీ ఆల్​రౌండర్. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు, 11 వికెట్లు ఉన్నాయి.

'Dre Russ is the Michael Jordan of T20 cricket': Mysore heaps praise on KKR all-rounder'Dre Russ is the Michael Jordan of T20 cricket': Mysore heaps praise on KKR all-rounder
రస్సెల్​

"ప్రపంచంలోనే అగ్రశ్రేణి టీ20 క్రికెటర్లలో ఆండ్రూ రసెల్ ఉండటం మా అదృష్టం. బ్యాట్స్​మన్​, బౌలర్​, ఆల్​రౌండర్ ఇలా మీరు ఎన్నైనా అనొచ్చు. కానీ అతడు టీ20ల్లో మైకేల్​ జోర్డన్​ లాంటివాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు"

వెంకీ మైసూర్​, కేకేఆర్​ సీఈఓ

రసెల్​తో పాటు సునీల్​ నరైన్​ లాంటి గొప్ప ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారని వెంకీ చెప్పారు. "సునీల్ నరైన్ బౌలర్​గా ఎలాంటివాడో అందరికీ తెలుసు. కానీ తనను తాను ఆల్​రౌండర్​గా మలుచుకున్నాడు. మరో విశేషమేంటంటే పాట్​ కమ్మిన్స్​, నితీశ్​ రానా రూపంలో జట్టులో మరో ఇద్దరు ఆల్​రౌండర్లు ఉన్నారు. బ్యాటింగ్​లోనూ, కెప్టెన్​కు కావాల్సినట్లు వివిధ దశల్లో బౌలింగ్ చేయడంలోనూ వీళ్లు సిద్ధహస్తులు" అని పేర్కొన్నారు.

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్.. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు జరగనుంది. 60 మ్యాచ్​ల్ని నిర్వహించనున్నారు. ఆగస్టు 20లోపు ఆటగాళ్లందరూ ప్రాక్టీసు కోసం ఆ దేశానికి చేరుకోనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.