ఐపీఎల్ 13వ సీజన్ కోసం అప్పుడే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి ఫ్రాంచైజీలు. మార్చి 29 నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ మెగాటోర్నీ ముంగిట తమ జట్టు లోగో మార్చుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ). సింహం బొమ్మతో కూడిన ఆ లోగో.. ధైర్యమైన, నిర్భయమైన జట్టు వ్యక్తిత్వాన్ని చాటుతుందని యాజమాన్యం పేర్కొంది. తాజాగా దీనిపై కౌంటర్ వేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.
మూడోసారైనా మారేనా..?
ఆర్సీబీ ఫ్రాంచైజీ తాజాగా లోగోను మూడోసారి మార్పు చేసింది. "మీరు ఎదురు చూసిన క్షణం ఇదే. కొత్త ఆర్సీబీ.. కొత్త దశాబ్దం.. కొత్త లోగో" అని పేర్కొంది. లోగోతో పాటు ఆ జట్టు జెర్సీ డిజైన్‌ను కూడా మార్చినట్లు తెలిపింది. అయితే ట్వీట్‌పై కౌంటర్ వేసిన సన్‌రైజర్స్.. "ఈ సారి లోగో చాలా బాగుంది. ఆరెంజ్ ఆర్మీ బోల్డ్‌గా ఆడేందుకు ఈ సీజన్లోనూ సిద్ధంగా ఉండండి" అంటూ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్‌ల ఫోటోను పోస్ట్ చేసింది.
-
Ee sala logo chaala bagundi! 👌
— SunRisers Hyderabad (@SunRisers) February 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
The #OrangeArmy is ready to #PlayBold yet again this season 😉🧡 https://t.co/43v0Fyq5U5 pic.twitter.com/vrbJanoa8y
">Ee sala logo chaala bagundi! 👌
— SunRisers Hyderabad (@SunRisers) February 14, 2020
The #OrangeArmy is ready to #PlayBold yet again this season 😉🧡 https://t.co/43v0Fyq5U5 pic.twitter.com/vrbJanoa8yEe sala logo chaala bagundi! 👌
— SunRisers Hyderabad (@SunRisers) February 14, 2020
The #OrangeArmy is ready to #PlayBold yet again this season 😉🧡 https://t.co/43v0Fyq5U5 pic.twitter.com/vrbJanoa8y
2009లో ఆర్సీబీ లోగో మార్చగా.. డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ కప్పు గెలిచింది. 2016లో మళ్లీ లోగో మారిస్తే.. సన్‌రైజర్స్ రెండోసారి విజేతగా నిలిచింది. తాజాగా లోగ్ మార్చడంపై మూడోసారి కప్పు మనదే అంటూ సన్‌రైజర్స్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ముచ్చటగా మూడోసారి కాబట్టి మేమే ట్రోఫీ గెలుస్తామంటూ ఆర్సీబీ అభిమానులు కౌంటర్ రిప్లై ఇస్తున్నారు.
12 సీజన్లలో ట్రోఫీ లేకుండానే..
2008లో ఐపీఎల్ ప్రారంభమవగా.. ఇప్పటికి మొత్తం 12 సీజన్లు ముగిశాయి. 2016లో ఫైనల్‌కి చేరిన ఆర్సీబీ.. ఆ తర్వాత నుంచి పేలవ ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశపరుస్తోంది. 2019 సీజన్‌లో వరుస పరాజయాల్ని చవిచూసిన ఆ జట్టు.. కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. ఐపీఎల్ 2020 సీజన్‌లోనైనా టైటిల్‌ను ముద్దాడాలనే పట్టుదలతో ఉంది.