న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ అరుదైన ఘనత సాధించాడు. ఆ దేశం తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 99 టెస్టుల్లో 46.28 సగటుతో 7,174 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో 19 శతకాలు 33 అర్ధసెంచరీలు ఉన్నాయి. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో ఈ ఘనత సాధించాడు.
అంతకుముందు ఈ రికార్డు కివీస్ మాజీ సారథి స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరిట ఉండేది. అతడు 111 టెస్టుల్లో 7,172 పరుగులు చేశాడు.
ఆసీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రాస్ టేలర్ కివీస్ తరఫున రెండో అత్యుత్తమ స్కోరు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 80, 22, 4, 2, 22, 22 పరుగులు చేశాడు. గత ఫిబ్రవరిలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన కివీస్ బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 17,250 పరుగులు చేశాడు టేలర్. ఇందులో 39 శతాకాలు, 88 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్ 279 పరుగుల తేడాతో ఓడింది. ఫలితంగా 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది ఆసీస్. తొలి ఇన్నింగ్స్‌లో ద్విశతకంతో చెలరేగిన లబుషేన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు వచ్చాయి.
ఇదీ చదవండి: మూడో టెస్టులో కివీస్‌పై ఆసీస్ విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్