ETV Bharat / sports

మొయిన్​ అలీకి ఇంగ్లాండ్​ కెప్టెన్​ క్షమాపణలు! - ఇంగ్లాండ్​ Vs ఇండియా వార్తలు

టీమ్ఇండియాతో రెండోటెస్టు ముగిసిన తర్వాత మొయిన్​ అలీ స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడని ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్ అన్నాడు. ఆ వ్యాఖ్యలపై దుమారం రేగడం పట్ల రూట్​ విచారం వ్యక్తం చేశాడు. తన మాటలు తప్పుగా వెళ్లడంపై ఆవేదన వ్యక్తం చేస్తూనే.. మొయిన్​ అలీకి క్షమాపణలు చెప్పాడని బ్రిటీష్​ మీడియా వెల్లడించింది.

Root apologises to Ali for saying all-rounder 'chose' to go home after second Test: Reports
మొయిన్​ అలీకి ఇంగ్లాండ్​ కెప్టెన్​ క్షమాపణలు!
author img

By

Published : Feb 18, 2021, 9:25 AM IST

టీమ్ఇండియాతో జరిగిన రెండోటెస్టులో అద్భుతంగా ఆల్​రౌండ్​ ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్​ ఆటగాడు మొయిన్​ అలీ.. సిరీస్​ మధ్యలోనే స్వదేశానికి వెళ్లడం చర్చనీయాంశమైంది. దీనికి కారణం ఆ జట్టులోని రొటేషన్​ పాలనే అని క్రికెట్​ విశ్లేషకులు అంటున్నారు. అయితే, మొయిన్ అలీ స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడని మ్యాచ్​ ముగిసిన తర్వాత ఆ జట్టు కెప్టెన్​ జో రూట్​ అన్నాడు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదంగా మారడం వల్ల మొయిన్​ అలీకి రూట్​ క్షమాపణలు తెలిపనట్లు బ్రిటీష్​​ వార్తాసంస్థలు వెల్లడించాయి.

"మొయిన్​ అలీ స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతడికి ఇది చాలా కష్టమైన పర్యటన. వరుస పర్యటనల నేపథ్యంలో బయో-బబుల్​ నుంచి ఏ ఆటగాడైన బయటకు రావాలని అనుకుంటే.. దానికి మద్దతుగా నిలవడం మాకు ముఖ్యం. అది అతడి నిర్ణయం కాబట్టి.. మిగిలిన టెస్టులకు ఉండమని అడగలేదు. అయితే సిరీస్​కు వీలైనంత ఎక్కువ మంది ఆటగాళ్లను ఉంచాలని కోరుకున్నాం. కానీ, ప్రతి ఆటగాడి సౌకర్యాలనూ మేము గౌరవించాలి".

- రెండో టెస్టు అనంతరం రూట్​ ప్రసంగం​

చెపాక్​ వేదికగా జరిగిన రెండు టెస్టుల్లోనూ భారత్​, ఇంగ్లాండ్​ జట్లు చెరో మ్యాచ్​లో గెలుపొంది సిరీస్​ను సమం చేశాయి. రెండో టెస్టులో ఇంగ్లాండ్​ క్రికెటర్​ మొయిన్​ అలీ తన ఆల్​రౌండ్​ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్​లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్​లో 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్​ ఓటమికి చేరువైన సమయంలో బ్యాటింగ్​ బరిలో దిగి.. కేవలం 18 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు.

ఇదీ చూడండి: 'వాలిమై' సినిమా గురించి మొయిన్​ అలీ అడిగాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.