టీ-20ల్లో అత్యధిక పరుగుల తేడాతో (172) గెలిచిన దేశంగా శ్రీలంక పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది రొమేనియా జట్టు. రొమేనియా కప్‌లో టర్కీతో జరిగిన మ్యాచ్‌లో 173 పరుగుల తేడాతో విజయం సాధించింది. తమిళనాడులో పుట్టిన శివకుమార్ పెల్వియార్ (105, 40 బంతుల్లో) శతకంతో అదరగొట్టి రొమేనియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మొదట బ్యాటింగ్ చేసిన రొమేనియా నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన టర్కీ 53 పరుగులకే ఆలౌటైంది. రాజేంద్ర పిసాల్, కాస్మిన్ జేవియూ చెరో మూడు వికెట్లతో ఆకట్టుకున్నారు.
అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన టాప్ -5 జట్లు
విజేత | ప్రత్యర్థి | పరుగుల తేడా | సంవత్సరం |
రొమేనియా | టర్కీ | 173 | 2019 |
శ్రీలంక | కెన్యా | 172 | 2007 |
పాకిస్థాన్ | వెస్టిండీస్ | 143 | 2018 |
భారత్ | ఐర్లాండ్ | 143 | 2018 |
ఇంగ్లాండ్ | వెస్టిండీస్ | 137 | 2019 |
రొమేనియాలో భారత్ పంచ్..
ఈ మ్యాచ్‌లో శివకుమార్ 40 బంతుల్లో 105 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అద్భుత శతకం చేయడం విశేషం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
భారత్ తమిళనాడులో పుట్టి పెరిగిన శివకుమార్ అండర్-15, అండర్-22, అండర్-25 టోర్నమెంట్లలో ఆడాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా 2015లో రొమేనియాలో స్థిరపడ్డాడు 31 ఏళ్ల శివకుమార్. క్రికెట్ మీద ఇష్టంతో ఆ దేశంలోని క్లజ్ క్రికెట్ క్లబ్లో చేరి మ్యాచ్‌లు ఆడుతూ సత్తాచాటుతున్నాడు.
ఇది చదవండి: ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన పీవీ సింధు