టీమ్ఇండియా ఆటగాడు రోహిత్ శర్మ, జట్టుతో బుధవారం(డిసెంబరు 30) కలుస్తాడని కోచ్ రవిశాస్త్రి చెప్పాడు. అతడితే ఇప్పటికే మాట్లాడామని అన్నాడు. అయితే మూడో టెస్టులో హిట్‌మ్యాన్ ఆడే విషయమై మేనేజ్మెంట్ స్పష్టత ఇవ్వలేకపోతోంది.
"రోహిత్ రేపు జట్టుతో కలుస్తాడు. గత కొన్ని రోజులుగా క్వారంటైన్లో ఉన్నాడు కాబట్టి అతడితో ముందుగా మాట్లాడి, ఆ తర్వాత తుదినిర్ణయం తీసుకుంటాం" -రవిశాస్త్రి, టీమ్ఇండియా కోచ్
తొడ కండర గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ.. సిడ్నీలో గత కొన్ని రోజుల నుంచి క్వారంటైన్లో ఉన్నాడు. జనవరి 7 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టు కోసం జట్టులో అవకాశమిస్తారో లేదో చూడాలి. సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెల్‌బోర్న్‌లోనే మూడో టెస్టు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్ జట్టు అద్భుత విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. తాత్కాలిక కెప్టెన్ రహానె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి, జానీ ముల్లా పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇవీ చదవండి: