ఆస్ట్రేలియా జట్టుపై ఎవరికీ సాధ్యం కాని రికార్డును సృష్టించాడు టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ. ఆసీస్ జట్టుపై 100 సిక్సులు (అన్ని ఫార్మాట్లలో కలిపి) బాదిన ఏకైక ఆటగాడిగా ఘనత వహించాడు.
-
Rohit Sharma's 💯 sixes vs AUSTRALIA#RohitSharma #INDvsAUS pic.twitter.com/hCJMDS7LuV
— Emerald Archer (@Naniricci45) January 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rohit Sharma's 💯 sixes vs AUSTRALIA#RohitSharma #INDvsAUS pic.twitter.com/hCJMDS7LuV
— Emerald Archer (@Naniricci45) January 8, 2021Rohit Sharma's 💯 sixes vs AUSTRALIA#RohitSharma #INDvsAUS pic.twitter.com/hCJMDS7LuV
— Emerald Archer (@Naniricci45) January 8, 2021
సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో లియోన్ బౌలింగ్‌లో సిక్సు బాదిన రోహిత్ ఈ రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్‌కు ముందు ఇతడు 99 సిక్సులతో ఉన్నాడు. కంగారూలపై ఆడిన 65 మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్ ఈ రికార్డు సాధించాడు. రోహిత్ తర్వాత ఎవ్వరూ అతడి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 63 సిక్సులతో తర్వాత స్థానంలో ఉన్నాడు. భారత ఆటగాళ్ల విషయానికొస్తే సచిన్, ధోనీ 60 సిక్సులు బాదారు.