ETV Bharat / sports

రోహిత్ ఇన్నింగ్స్​కు గుర్తింపు రాలేదు: యువీ - Rohit Sharma's innings in the 2007 World T20

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​.. 2007 ప్రపంచకప్ ఫైనల్లో రోహిత్​ శర్మ ఆడిన ఇన్నింగ్స్​ను గుర్తుచేసుకున్నాడు. అది ఎంతో ప్రత్యేకమైందని కితాబిచ్చాడు.

rohit
రోహిత్
author img

By

Published : Jul 27, 2020, 7:29 PM IST

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​.. 2007లో సెప్టెంబరు 24న జరిగిన టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​తో తలపడిన మ్యాచ్​ను గుర్తుచేసుకున్నాడు. ఈ మ్యాచ్​లో​ రోహిత్​ శర్మ ఇన్నింగ్​ ఎంతో ప్రత్యేకమైందని కొనియాడాడు.

"ఈ మ్యాచ్​లో గౌతమ్​ గంభీర్​.. 54 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఆర్పీ సింగ్​, ఇర్ఫాన్​ పఠాన్​ చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మరో వ్యక్తి రోహిత్​ శర్మ. అద్భుతంగా ఆడాడు. కేవలం 16 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టు స్కోరును 150కు చేర్చాడు. రెండు బౌండరీలు, ఓ సిక్స్​ బాదాడు. కానీ అతడి ప్రతిభను మేమెవ్వరం గుర్తించలేదు."

-యువీ, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

ఈ మ్యాచ్​లో పాక్​పై భారత్​ ఐదు పరుగులు తేడాతో విజయం సాధించింది.

ఇది చూడండి జులై 30 నుంచి వన్డే ప్రపంచకప్​ సూపర్​లీగ్ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.