టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. తన కెరీర్లో కొట్టిన అత్యుత్తమ సిక్సర్లను ఇన్స్టాగ్రామ్ వేదికగా గుర్తుచేసుకున్నాడు. మెరుపు షాట్లతో బంతి కొన్నిసార్లు స్డేడియం ఆవలివైపుకు వెళ్లింది. ఈ వీడియోను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. "అలాంటి షాట్లను మిస్ అవుతున్నా" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశాడు హిట్‌మ్యాన్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రకృతిపై ప్రేమ
లాక్డౌన్ కారణంగా లభించిన విరామ సమయంలో సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు రోహిత్. గతవారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకృతిని కాపాడుకోవాలని.. సోమవారం ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా సముద్రనీటిని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చాడు రోహిత్ శర్మ.
- View this post on Instagram
Isn’t blue such a good colour? Let’s try and keep it that way #WorldOceanDay @ritssajdeh
">
కరోనా కారణంగా మార్చి నుంచే క్రీడా టోర్నీలన్ని వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఐపీఎల్-13 సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేసింది బీసీసీఐ. అయితే టోర్నీని ఈ ఏడాదిలో కచ్చితంగా నిర్వహిస్తామని తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వెల్లడించాడు.
ఇదీ చూడండి... నా కెరీర్లో ఆ మ్యాచ్‌లు ప్రత్యేకం: భజ్జీ