టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌శర్మ.. మరో అరుదైన రికార్డుకు చేరువలో నిలిచాడు. రాజ్‌కోట్ వేదికగా బంగ్లాదేశ్‌తో గురువారం జరగనున్న మ్యాచ్‌తో 100 అంతర్జాతీయ టీ20లు ఆడిన తొలి భారత క్రికెటర్‌గా అవతరించనున్నాడు. ఈ ప్రయాణంలో తనకెదురైన అనుభవాలను పంచుకున్నాడు హిట్‌మ్యాన్.
"నాది సుదీర్ఘ ప్రయాణం. 2007లో టీ20 ప్రపంచకప్‌లో అరంగేట్రం చేశాను. ఈ ఫార్మాట్లో 12 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఈ ప్రయాణం ఎన్నో పాఠాలు నేర్పింది. జట్టులోకి యువకుడిగా వచ్చినప్పుడు నేర్చుకుంటూ ముందుకు సాగాను. ఆ తర్వాత ఒడుదొడుకులు ఎదురయ్యాయి. ఆటను అర్థం చేసుకుని నిలకడ సాధించాను. నా కెరీర్ నాకెంతో సంతోషం, మధుర స్మృతులను ఇచ్చింది"
-రోహిత్‌శర్మ, భారత క్రికెటర్
అదే విధంగా ప్రపంచ క్రికెట్లో 'శతక' మ్యాచ్‌ల ఘనత అందుకున్న రెండో ఆటగాడు కానున్నాడు రోహిత్. పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ (111 మ్యాచ్‌లు) అతడి కన్నా ముందున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిటే ఉంది. 99 మ్యాచుల్లో 2,452 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలు, 17 అర్ధశతకాలు ఉన్నాయి. కోహ్లీ అత్యధిక పరుగుల రికార్డును బంగ్లాతో దిల్లీ వేదికగా జరిగిన తొలి పోరులో అధిగమించాడు రోహిత్.
ఇది చదవండి: బంగ్లాను ఓడించేందుకు పక్కా ప్లాన్‌తో వస్తాం: రోహిత్ శర్మ