కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ రద్దయ్యాయి. క్రికెటర్లు ఇంటివద్దే కాలక్షేపం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. తాజాగా టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో లైవ్ చాట్‌లో పాల్గొన్నాడు. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. తన క్రికెట్ క్రష్ గురించి చెప్పాడు.
"నేను జట్టులోకి వచ్చినప్పుడు యువరాజ్‌పై నాకు క్రష్ ఉండేది. నేను ప్రతిసారి యువీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుండేవాడిని. అతడు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాడో చూస్తూ నేర్చుకునేవాడిని."
-రోహిత్ శర్మ, టీమ్ఇండియా క్రికెటర్
ఇదే లైవ్‌లో యువరాజ్ సింగ్ కూడా పలు విషయాలు పంచుకున్నాడు. ప్రస్తుతం టీమ్ఇండియా యువ క్రికెటర్లు బాధ్యతగా వ్యహరించడం లేదని అన్నాడు. తాను, రోహిత్ జట్టులోకి వచ్చినపుడు సీనియర్లు క్రమశిక్షణతో ఉండేవారని తెలిపాడు.