ETV Bharat / sports

'మహేంద్రసింగ్​ ధోనీతో నన్ను పోల్చొద్దు ప్లీజ్​' - raina latest news

భారత క్రికెట్​లో రోహిత్​శర్మ మరో ధోనీ అని రైనా చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు హిట్​మ్యాన్​. ధోనీ ప్రత్యేకమని ప్రశంసించిన రోహిత్​.. ఎవరి బలాబలాలు వారికే సొంతమని పేర్కొన్నాడు.

rohit latest news
'మహేంద్రసింగ్​ ధోనీతో నన్ను పోల్చొద్దు ప్లీజ్​'
author img

By

Published : Aug 3, 2020, 10:14 PM IST

టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీతో తనను పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు ఓపెనర్‌‌ రోహిత్‌ శర్మ. అసలు మహీలా మరెవ్వరూ ఉండరని పేర్కొన్నాడు. భారత జట్టులో హిట్‌మ్యానే తర్వాతి ధోనీ అన్న సురేశ్‌ రైనా మాటలు విన్నానని వెల్లడించాడు. ఎవరికి వారు భిన్నంగా ఉంటారని తెలిపాడు.

"టీమ్‌ఇండియా తర్వాతి ధోనీ అతడే (రోహిత్‌)నని నేను కచ్చితంగా చెప్పగలను" అని ది సూపర్‌ఓవర్‌ పొడ్‌కాస్ట్‌‌లో రైనా అన్నాడు. "నేను అతడిని పరిశీలించాను. ప్రశాంతంగా ఉంటాడు. అందరి మాటా వింటాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతాడు. జట్టును ముందుండి నడుపుతాడు. ఎప్పుడైతే కెప్టెన్‌ జట్టును ముందుండి నడుపుతూ డ్రెస్సింగ్ ‌రూమ్‌లో అందరినీ గౌరవిస్తాడో అప్పడతనికి అన్నీ దొరుకుతాయి" అని రైనా వెల్లడించాడు.

రైనా వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా రోహిత్‌ స్పందించాడు. "అవును, సురేశ్‌ రైనా వ్యాఖ్యలు విన్నాను. ఎంఎస్‌ ధోనీ ఎంతో ప్రత్యేకం. అతడిలా మరొకరు ఉండరు. నేనైతే అలాంటి పోలికలు వద్దనే అంటాను. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు భిన్నమే. ఎవరి బలాబలాలు వారివే" అని హిట్‌మ్యాన్‌ అన్నాడు.

రోహిత్‌‌ నాయకత్వాన్ని గతంలోనూ చాలామంది ప్రశంసించారు. అతడు ధోనీలాగే వ్యవహరిస్తాడని పేర్కొన్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఏకంగా నాలుగు సార్లు టైటిల్ అందించిన విషయాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తారు. ఇక ఐసీసీ నిర్వహించే టోర్నీలన్నీ గెలిచిన మహీ.. ఐపీఎల్‌లో మూడుసార్లు చెన్నై సూపర్‌కింగ్స్‌ను విజేతగా నిలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.