ETV Bharat / sports

'అతడు టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్ అవుతాడు' - Rohit sharma about Shubhman gill

యువ క్రికెటర్ శుభ్​మన్ గిల్​పై ప్రశంసలు కురిపించాడు టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ. అతడు భవిష్యత్​లో స్టార్ క్రికెటర్​గా ఎదుగుతాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

రోెహిత్
రోెహిత్
author img

By

Published : Apr 25, 2020, 5:44 AM IST

టీమ్​ఇండియా యువ క్రికెటర్​ శుభ్​మల్ గిల్​పై ప్రశంసలు కురిపించాడు రోహిత్ శర్మ. సీనియర్ క్రికెటర్ హర్భజన్​ సింగ్​తో కలిసి ఇన్​స్టా లైవ్​లో పాల్గొన్న హిట్​మ్యాన్ పలు విషయాలను పంచుకున్నాడు. అలాగే శుభ్​మన్ గురించి మాట్లాడాడు.

"శుభ్​మన్ గొప్ప బ్యాట్స్​మన్ అవుతాడు. భవిష్యత్​లో టీమ్​ఇండియాకు స్టార్ క్రికెటర్​గా ఎదుగుతాడు. స్థిరంగా పరుగులు సాధిస్తూ విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నాడు. అతడికి దేశవాళీల్లో మంచి రికార్డు ఉంది. భవిష్యత్​లో జట్టులోకి తీసుకునే ఆలోచన ఉంది. కానీ పోటీ కూడా తీవ్రంగా ఉంది"

-రోహిత్ శర్మ, టీమ్​ఇండియా క్రికెటర్

గతేడాది న్యూజిలాండ్​తో జరిగిన వన్డే సిరీస్​తో శుభ్​మన్ టీమ్​ఇండియా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్​తో జరిగిన టెస్టు సిరీస్​తో పాటు, న్యూజిలాండ్​లో జరిగిన టెస్టు సిరీస్​కూ ఎంపికైనా ఒక్క మ్యాచ్​లోనూ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.