ETV Bharat / sports

కెప్టెన్​గా నా సిద్ధాంతం అదే: రోహిత్ - రోహిత్​ శర్మ తాజా వార్తలు

జట్టుకు సారథిగా వ్వవహరిస్తున్నప్పుడు.. తనను అందరి కంటే తక్కువ ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తానని అన్నాడు టీమ్​ఇండియా క్రికెటర్ రోహిత్​ శర్మ. ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ జట్టుకు విజయవంతమైన సారథిగా కొనసాగుతున్నాడు హిట్​మ్యాన్.

Rohit Sharma on captaincy
రోహిత్​ శర్మ
author img

By

Published : Aug 5, 2020, 6:11 PM IST

కెప్టెన్సీ విషయంలో రోహిత్​ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. నిస్వార్థంగా వ్యవహరిస్తూ.. జట్టులో అందర్నీ సమానంగా చూస్తాడు. తాజాగా, ముంబయి ఇండియన్స్ జట్టులో తనను అతి తక్కువ ముఖ్యమైన ఆటగాడిగా చెప్పుకున్నాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

సెప్టెంబరు 19నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్​ ప్రారంభంకానుంది. ఈ క్రమంలోనే లీగ్​లో తలపడేందుకు తమ జట్టును సంసిద్ధం చేస్తున్నాడు రోహిత్​.

"మనం ఒక కెప్టెన్ స్థానంలో​ ఉంటే.. జట్టులో అందరికన్నా తక్కువ ముఖ్యమైన వ్యక్తిగా భావించాలని నా సిద్ధాంతం. మిగిలిన వారు అనేక విషయాల్లో చాలా ముఖ్యమైన వ్యక్తులు. ఇది ఒక్కో కెప్టెన్​కు ఒక్కోలాగా వర్తిస్తుంది. నాకు మాత్రం ఈ సిద్ధాంతం పాటించడం ఇష్టం."

-రోహిత్​ శర్మ, టీమ్​ఇండియా క్రికెటర్​

క్లిష్ట పరిస్థితుల్లో కోపం రావడం సహజమని.. అయితే, దానిని జట్టు సభ్యుల మధ్య చూపించకూడదని అన్నాడు రోహిత్​. భావోద్వేగాలను ఎప్పటికప్పుడు దాచేస్తూ ఉండాలని పేర్కొన్నాడు. ఐపీఎల్​ గురించి స్పందిస్తూ.. లీగ్​ ప్రారంభానికి ముందు శిక్షణకు తగినంత సమయం ఉందని భారత వైస్​ కెప్టెన్​ అన్నాడు.

"ఈ వారంలో వ్యాయామశాలలు తెరుచుకుంటాయని అనుకుంటున్నా. ముంబయిలో వర్షాకాలం కారణంగా అవుట్​ డోర్​లో శిక్షణ కష్టం. కాబట్టి ఇండోర్​లో ప్రాక్టీస్​ ప్రారంభిస్తా. ఇండోర్​ సౌకర్యాలకు సంబంధించి ఎమ్​సీఏకు లేఖ రాయాలనుకుంటున్నా" అని వెల్లడించాడు రోహిత్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.