పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రస్తుతం డామినెంట్ ఓపెనర్‌గా ఉన్నాడు టీమ్ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ. ఈ మధ్య ఎవరు తమ ప్రపంచ ఎలెవన్ తయారు చేసినా రోహిత్ పేరు కచ్చితంగా ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ రూపొందించిన ఆసీస్-భారత్ సంయుక్త జట్టులో మాత్రం హిట్‌మ్యాన్‌కు చోటివ్వలేదు. ఓపెనర్లుగా సెహ్వాగ్, గిల్‌క్రిస్ట్‌లను ఎంపిక చేశాడు.
"సెహ్వాగ్ నెంబర్ వన్ ఆటగాడు. ప్రత్యర్థిపై ఎప్పుడూ పెత్తనం చెలాయిస్తాడు. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థి విజయం మీద నమ్మకం వదులుకోవాల్సిందే. మరో ఓపెనర్‌గా రోహిత్‌ను ఎంపిక చేయాలనుకున్నా. కానీ సెహ్వాగ్, గిల్‌క్రిస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే చూడాలనుకుంటున్నా. అందుకే గిల్‌క్రిస్ట్‌ను తీసుకున్నా."
-ఆరోన్ ఫించ్, ఆస్ట్రేలియా క్రికెటర్
మూడు, నాలుగు స్థానాల్లో రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీలను ఎంపిక చేశాడు ఫించ్. అలాగే ఐదు, ఆరు స్థానాల్లో ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, ఆండ్రూ సైమండ్స్‌ను తీసుకున్నాడు. ఏడులో మహేంద్ర సింగ్ ధోనీకి చోటిచ్చాడు. గిల్‌క్రిస్ట్, ధోనీ ఎవరైనా కీపింగ్ చేయొచ్చని చెప్పాడు.
అలాగే బౌలర్ల విషయానికి వస్తే మెక్‌గ్రాత్, బ్రెట్‌లీ, జస్ప్రీత్ బుమ్రాను ఎంచుకున్నాడు. కానీ స్పిన్నర్ విషయంపై స్పష్టతనివ్వలేదు. "బ్రాడ్ హాగ్ రికార్డు బాగుంది. హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజాలను తీసుకుంటే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు ఢోకా ఉండదు. కానీ వీరిలో ఎవరిని తీసుకోవాలో అర్థం కావట్లేదు." అంటూ చెప్పుకొచ్చాడు ఫించ్.
ఫించ్ ఆసీస్-భారత్ ఎలెవన్
వీరేంద్ర సెహ్వాగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, ఆండ్రూ సైమండ్స్, ధోనీ, బ్రెట్‌లీ, (ఈ స్థానం ఎంపిక చేయలేదు), మెక్‌గ్రాత్, జస్ప్రీత్ బుమ్రా.