ETV Bharat / sports

అమ్మ ఊరిలో రోహిత్​ అదిరిపోయే శతకాలు

విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టెస్టులో టీమిండియా ఓపెనర్​ రోహిత్​శర్మ మరోసారి చెలరేగి ఆడాడు. తన అమ్మమ్మ ఊరిలో జరుగుతోన్న మ్యాచ్​లో హిట్​మ్యాన్​ మరో శతకం ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్​ 127 పరుగులు (149 బంతుల్లో 10ఫోర్లు, 7 సిక్సర్లు)సాధించాడు. పలు రికార్డులూ నమోదు చేశాడు.

author img

By

Published : Oct 5, 2019, 5:15 PM IST

అమ్మ ఊరిలో రోహిత్​ అదిరిపోయే శతకాలు

తన అమ్మ ఊరు విశాఖపట్నంలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 127 పరుగులు(149 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్సర్లు) రెచ్చిపోయి ఆడాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్వితీయ శతకం బాదేశాడు. ఫిలాండర్‌ వేసిన 52 ఓవర్ 5 బంతికి సింగిల్‌ తీసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఓపెనర్‌గా అరంగేట్రంలోనే రెండు ఇన్నింగ్సుల్లోనూ శతకాలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్‌ చరిత్ర సృష్టించాడు.

అరంగేట్ర ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఘనతనూ అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడు 176 పరుగులు చేశాడు. మొత్తం తొలి టెస్టులో 303 పరుగులు చేశాడు.

అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు...

  • 303 రోహిత్​ శర్మ v (విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాపై-2019/20)
  • 208 కే వెసెల్స్​v (బ్రిస్బేన్​ వేదికగా ఇంగ్లాండ్​పై- 1982/83)
  • 201 బీ కురుప్పు v(కొలంబో వేదికగా న్యూజిలాండ్​పై-1986/87)
  • 200 ఏ జాక్సన్​ v (అడిలైడ్​ వేదికగా ఇంగ్లాండ్​పై-1928/29)
  • 200 జీ గ్రీనిడ్జ్​ v(బెంగళూరు వేదికగా భారత్​పై-1974/75)

సెంచరీ తర్వాత హిట్‌మ్యాన్‌ మరింత రెచ్చిపోయాడు. భారీ సిక్సర్లే లక్ష్యంగా ఆడాడు. డేన్‌ పీడ్‌ వేసిన 56వ ఓవర్‌లో చివరి మూడు బంతులను అద్భుతమైన సిక్సర్లుగా మలిచి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఫలితంగా మూడు ఫార్మాట్లలోనూ భారత్​ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.

టెస్టుల్లో: 13 v (విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాపై-2019/20)
వన్డేల్లో: 16 v (బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాపై-2013)
టీ20ల్లో: 10 v (ఇండోర్​ వేదికగా శ్రీలంకపై-2017)

రోహిత్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఒక్క టెస్టు మ్యాచ్​లో అత్యధిక సిక్సర్లు కొట్టిన పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ (12) రికార్డును తిరగరాశాడు. ఈ మ్యాచ్​లో హిట్​మ్యాన్13 సిక్సర్లు సాధించాడు.

ఒక టెస్టులో రెండు శతకాలు బాదిన విజయ్‌ హజారే, సునిల్‌ గావస్కర్‌ (3 సార్లు), రాహుల్‌ ద్రవిడ్‌ (2 సార్లు), విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె సరసన నిలిచాడు. భారత్​లో చివరిగా ఆడిన 7 ఇన్నింగ్స్​ల్లోనూ 7 అర్ధశతకాలు నమోదు చేసి రికార్డు సృష్టించాడు. ద్రవిడ్ ఆరు అర్ధసెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.

సఫారీ బౌలర్​ కేశవ్‌ మహరాజ్‌ వేసిన 56వ ఓవర్ 5 బంతికి స్టంపౌట్‌ అయ్యాడు రోహిత్. దూరంగా వెళ్తున్న బంతిని భారీ షాట్‌ ఆడే క్రమంలో బలంగా బాదేందుకు ముందుకు వచ్చాడు. అతడి నుంచి తప్పించుకున్న బంతి కీపర్‌ డికాక్‌ చేతుల్లో పడింది. అతడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వికెట్లను గిరాటేశాడు. ఫలితంగా రెండు శతకాలు, 13 సిక్సర్లతో తొలి టెస్టులో రోహిత్​ ఆట ముగిసింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan. Max use 3 minutes per match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Edion Stadium, Hiroshima, Japan- 5th October 2019
Sanfrecce Hiroshima (purple shirts) v Vissel Kobe (white shirts)
First half:
1. 00:00 Teams walking out
2. 00:05 Sanfrecce Hiroshima head coach Hiroshi Jofuku
3. 00:09 GOAL:  5th minute.  Sho Inagaki scores for Sanfrecce Hiroshima/1-0
4. 00:23 GOAL: 19th minute. Kyogo Furuhashi scores for Vissel Kobe/1-1
5. 00:39 GOAL: 39th minute.  Sho Inagaki scores for Sanfrecce Hiroshima/2-1
6. 00:53 Penalty:  41st minute. Thomas Vermaelen handles the ball and is shown a yellow card
7. 01:06 Replay of the handball
8. 01:14 Penalty saved: 42nd minute. Douglas Vieira fails to score from the penalty spot for Sanfrecce Hiroshima
9. 01:26 Replay of penalty save
Second half:
10. 01:35 Red card: 65th minute. Leo Osaki shown a red card after bringing down Douglas Vieira just outside the box.
11. 01:51 Replay of foul
12. 01:58 GOAL: 66th minute. Tsukasa Morishima scores for Sanfrecce Hiroshima/3-1
13. 02:06 Replay of goal
14. 02:12 GOAL: 77th minute. Junya Tanaka scores for Vissel Kobe/2-3
15. 02:25 GOAL: 84th minute. Hayao Kawabe scores for Sanfrecce Hiroshima/4-2
16. 02:41 GOAL: 90th minute. Douglas Vieira scores for Sanfrecce Hiroshima/5-2
17. 03:10 GOAL: 90+2 minute. Tsukasa Morishima scores for Sanfrecce Hiroshima/6-2
SOURCE: Lagardere Sports
DURATION: 03:28
STORYLINE:
Sanfrecce Hiroshima thrashed 10-man Vissel Kobe 6-2 in the Japanese J1 League on Saturday to move to within six points of leaders Tokyo FC.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.