టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్‌లో గాయపడ్డాడని సమాచారం. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు ఈ వార్త.. భారత శిబిరంలో ఆందోళన రేపుతోంది.
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు విరామం తీసుకున్నాడు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ. ఆస్ట్రేలియాతో ఈనెల 14 నుంచి మొదలయ్యే వన్డే సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముంబయి వాంఖడే మైదానంలో ఇతడు ప్రాక్టీస్ చేస్తుండగా చేతి బొటనవేలికి గాయమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు టీమిండియాతో పాటు అభిమానుల్లోనూ ఆందోళన పెంచుతోంది.
గతేడాది వన్డేల్లో అద్భుత ఫామ్ కనబర్చిన రోహిత్.. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
ఇవీ చూడండి.. బిగ్‌బాష్ లీగ్‌లో రికార్డుల మోత.. ఒకేసారి రెండు