టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఖడ్గమృగాలను సంరక్షించేందుకు మరో అడుగు ముందుకేశాడు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ) ఇండియా, యానిమల్ ప్లానెట్తో కలిసి ప్రచారానికి సిద్ధమయ్యాడు. అంతరించిపోతున్న ఖడ్గమృగాలను కాపాడటానికి తనతో చేతులు కలపాలని రోహిత్ శర్మ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చాడు.
-
There are approx. 3500 #Greateronehornedrhinos in the world today; 82% of them in India. Join me to #batforrhinos on #worldrhinoday and support measures to protect these animals in the wild. Log onto https://t.co/Qnhv9NhdHu to support the cause. @WWFINDIA @AnimalPlanetIn pic.twitter.com/iMUy315MAr
— Rohit Sharma (@ImRo45) September 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">There are approx. 3500 #Greateronehornedrhinos in the world today; 82% of them in India. Join me to #batforrhinos on #worldrhinoday and support measures to protect these animals in the wild. Log onto https://t.co/Qnhv9NhdHu to support the cause. @WWFINDIA @AnimalPlanetIn pic.twitter.com/iMUy315MAr
— Rohit Sharma (@ImRo45) September 4, 2019There are approx. 3500 #Greateronehornedrhinos in the world today; 82% of them in India. Join me to #batforrhinos on #worldrhinoday and support measures to protect these animals in the wild. Log onto https://t.co/Qnhv9NhdHu to support the cause. @WWFINDIA @AnimalPlanetIn pic.twitter.com/iMUy315MAr
— Rohit Sharma (@ImRo45) September 4, 2019
" మనతో పాటు జీవిస్తున్న మిగతా ప్రాణులను కాపాడటం మన కర్తవ్యం. ప్రకృతి ఇచ్చిన వనరులను మన పిల్లల కోసం, భవిష్యత్తు కోసం రక్షించాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా, యానిమల్ ప్లానెట్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందర్నీ చైతన్యవంతం చేస్తుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3వేల 500 ఖడ్గమృగాలు ఉన్నాయి. వీటిలో 82% భారత్ లోనే ఉన్నాయి. ఖడ్గమృగాల కోసం ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం రోజున నాతో చేతులు కలపండి".
-- రోహిత్ శర్మ, భారత క్రికెటర్
డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా 2018లో బాధ్యతలు స్వీకరించాడు హిట్మ్యాన్. లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఖడ్గమృగాల కొమ్ములు బాగా ఉపయోగపడతాయనే కారణంతో వాటిని విచక్షణా రహితంగా చంపేస్తున్నారు. ఫలితంగా ఈ జీవుల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది.
ఇదీ చదవండి...10 నిముషాల్లో... 48వేల టికెట్లు ఫసక్!