నిర్ణిత ఓవర్ల క్రికెట్లో పరుగుల వీరుడు రోహిత్‌శర్మ.. త్వరలోనే సుదీర్ఘ మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ అవతారం ఎత్తే అవకాశముంది. 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన హిట్‌మ్యాన్.. దాదాపు 6 ఏళ్లకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆడే అవకాశం లభించింది. ఇప్పటి వరకు 27 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఈ సిక్సర్ల వీరుడు 1585 పరుగులు చేశాడు. సుధీర్ఘా ఫార్మాట్లో 3 నుంచి 6 స్థానాల మధ్యే ఇప్పటివరకు బరిలో దిగాడు రోహిత్.
రోహిత్‌శర్మ టెస్టు రికార్డు...
స్థానం | టెస్టులు | ఇన్నింగ్స్ | నాటౌట్ | పరుగులు | అత్యధికం | సగటు | శతకాలు | అర్థశతకాలు | స్ట్రైక్‌రేటు |
నెం.3 | 4 | 5 | 0 | 107 | 53 | 21.40 | 0 | 1 | 41.63 |
నెం.4 | 1 | 1 | 0 | 4 | 4 | 4.00 | 0 | 0 | 25.00 |
నెం.5 | 9 | 16 | 1 | 437 | 79 | 29.13 | 0 | 3 | 48.55 |
నెం.6 | 16 | 25 | 6 | 1037 | 177 | 54.57 | 3 | 6 | 60.71 |
మొత్తం | 27 | 47 | 7 | 1585 | 177 | 39.62 | 3 | 10 | 55.01 |
ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టుకు ఓపెనర్‌గా ఉన్న రాహుల్... విండీస్ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు. చివరి 12 ఇన్నింగ్స్‌ల్లో 95 పరుగులు మాత్రమే చేశాడు. నేడు దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టను ఎంపిక చేయనున్నారు సెలక్టర్లు. ఇందులో రాహుల్ ఓపెనర్‌గా ఉద్వాసన ఎదుర్కోనున్నట్లు సమాచారం.
రాహుల్ టెస్టు రికార్డు...
స్థానం | టెస్టులు | ఇన్నింగ్స్ | నాటౌట్ | పరుగులు | అత్యధికం | సగటు | సెంచరీ | అర్ధసెంచరీ | స్ట్రైక్‌రేటు |
చివరి 12 మ్యాచ్‌ల్లో | 12 | 1 | 95 | 44 | 17.72 | 0 | 0 | 42.85 | |
ఓపెనర్‌గా | 33 | 54 | 2 | 1915 | 199 | 36.82 | 5 | 10 | 56.22 |
మొత్తం | 36 | 60 | 2 | 2006 | 199 | 34.58 | 5 | 11 | 56.45 |
దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్ సెప్టెంబర్ 15 నుండి ప్రారంభంకానుంది. ఆ తర్వాత టెస్ట్ సిరీస్ అక్టోబర్ 2 నుండి జరుగుతుంది. ప్రస్తుతం 5 రోజుల మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా హిట్‌మ్యాన్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించాలని సూచించాడు.
ఇదీ చదవండి...