టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా.. రోహిత్‌శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. అద్భుతమైన సారథ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన మహీ తరహాలో జట్టును నడిపించగలడని హిట్‌మ్యాన్ గురించి చెప్పాడు.
ఇప్పటికే ఐపీఎల్లో ముంబయి జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్.. నాలుగుసార్లు ఆ జట్టుకు టైటిళ్లు అందించాడు. లీగ్‌లో విజయవంతమైన కెప్టెన్‌గానూ ఘనత అందుకున్నాడు. 2018 ఆసియా కప్‌లోనూ భారత జట్టును నడిపించి ట్రోఫీ సాధించాడు.
" భారత జట్టుకు రోహిత్ మరో ధోనీ కానున్నాడు" అని దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జేపీ డుమిని, బ్యాట్స్ ఉమన్ జెమీమా రోడ్రిగ్స్‌కు బుధవారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు రైనా.
"నేను చాలా ఏళ్లుగా రోహిత్‌ను చూస్తున్నాను. అతడిలోని నెమ్మదితత్వం, వినేగుణం మిగిలిన ప్లేయర్లకు స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇస్తాయి. జట్టును ముందుడి నడిపించగలడు. కెప్టెన్ మంచి నాయకుడైతే డ్రెస్సింగ్ రూంలోని వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది. రోహిత్ అందర్నీ సమన్వయం చేయగలడు. బంగ్లాదేశ్‌లో ఆసియాకప్ జరిగినప్పుడు నేను అతడి సారథ్యంలోనే ఆడాను. యువకులైన శార్దుల్, వాషింగ్టన్ సుందర్, చాహల్ వంటి ఆటగాళ్లలో బాగా స్ఫూర్తిని నింపడం నేను చూశాను. అతడు పక్కన ఉన్నప్పుడు ఆటగాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు. ధోనీ తర్వాత హిట్‌మ్యాన్ అంతేస్థాయిలో తెలివైన వ్యక్తి. ఇప్పటికే తన జట్టుకు ధోనీ కంటే ఎక్కువ ట్రోఫీలు అందించాడు. ఇద్దరి ఆలోచన, తీరు ఒకేలా ఉంటుంది. ఇద్దరూ వినే సారథులు" అని అభిప్రాయపడ్డాడు రైనా.
ఈ ఏడాది ఐపీఎల్‌ను సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహించనున్నారు. 13వ సీజన్ లీగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌పై ఆగస్టు 2న పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయంతీసుకోనున్నారు.