ETV Bharat / sports

'అందుకే రోహిత్​-ధావన్​ జోడీ సూపర్​హిట్​'

author img

By

Published : Jun 30, 2020, 5:30 AM IST

Updated : Jun 30, 2020, 6:47 AM IST

ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఆడటం వల్లే రోహిత్-ధావన్ విజయవంతమైన జోడీగా పేరుతెచ్చుకున్నారని చెప్పాడు టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.

Rohit and Shikha
రోహిత్​-శిఖర్​

టీమ్​ఇండియా ఓపెనింగ్​ జోడీ రోహిత్​ శర్మ, శిఖర్​ ధావన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో శతక భాగస్వామ్యాలు నెలకొల్పి, జట్టుకు చాలా విజయాలను అందించారు. ఇటీవలే క్రికెట్ కనెక్టడ్ కార్యక్రమంలో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్.. ధావన్-రోహిత్​లు విజయవంతం కావడానికి గల కారణాల్ని వెల్లడించాడు.

"ధావన్ ఎంత ప్రశాంతంగా ఆడతాడో మనందరికి తెలుసు. అలానే రోహిత్​ శర్మ, పరిస్థితులు ఆధారంగా గేర్​ మార్చుతూ బ్యాటింగ్​లో ఊపు తీసుకొస్తాడు. అయితే వీరిద్దరూ ఒకరి బలాలు, బలహీనతలను మరొకరు అర్థం చేసుకుంటూ ఆడతారు. అందుకే వీరిద్దరి ఓపెనింగ్​ జోడీగా విజయవంతమయ్యారు"

-ఇర్ఫాన్​ పఠాన్​, టీమ్​ఇండియా మాజీ పేసర్

2013లో ఓపెనర్లుగా మారిన రోహిత్​-ధావన్​.. తమ అద్భుతమైన బ్యాటింగ్​తో ఇప్పటివరకు 16 శతక భాగస్వామ్యాలను నెలకొల్పారు. ఇప్పటివరకు అత్యధికంగా 21 శతక భాగస్వామ్యాలు నెలకొల్పి గంగూలీ- సచిన్ తెందుల్కర్ రికార్డులకెక్కారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన గిల్‌క్రిస్ట్- మాథ్యూ హేడెన్(16).. రోహిత్-ధావన్​లతో సమానంగా ఉన్నారు.

rohit dhawan
రోహిత్ శర్మ-శిఖర్ ధావన్

ఇది చూడండి : టెస్టు ఛాంపియన్​ షిప్​ రీషెడ్యూల్​పై త్వరలో నిర్ణయం!

Last Updated : Jun 30, 2020, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.