రోడ్డు భద్రత అవగాహనలో భాగంగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా లెజెండ్స్ జట్టు శుభారంభం చేసింది. నేడు వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన పోరులో.. 6 వికెట్ల తేడాతో నెగ్గింది సఫారీ జట్టు. ఈ ఓటమితో విండీస్ ఖాతాలో మరో పరాజయం చేరింది.
ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ డారెన్ గంగా(31), పావెల్(31) రాణించారు. లారా(4), జాకబ్స్(0) నిరాశపర్చారు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో అల్బీ మోర్కెల్ 2 వికెట్లు, పాల్ హారిస్ 3 వికెట్లు సాధించారు.
-
Skipper @JontyRhodes8 scores a 50 & takes @south_legends to victory! @RSWorldSeries @IndiesLegends @Colors_Cineplex @viacom18 @unacademy @bookmyshow #unacademyroadsafetyworldseries #YehJungHaiLegendary #LegendsAreBack #voot #raveegaekwad #roadsafety pic.twitter.com/b1FOdJxH5T
— Road Safety World Series (@RSWorldSeries) March 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Skipper @JontyRhodes8 scores a 50 & takes @south_legends to victory! @RSWorldSeries @IndiesLegends @Colors_Cineplex @viacom18 @unacademy @bookmyshow #unacademyroadsafetyworldseries #YehJungHaiLegendary #LegendsAreBack #voot #raveegaekwad #roadsafety pic.twitter.com/b1FOdJxH5T
— Road Safety World Series (@RSWorldSeries) March 11, 2020Skipper @JontyRhodes8 scores a 50 & takes @south_legends to victory! @RSWorldSeries @IndiesLegends @Colors_Cineplex @viacom18 @unacademy @bookmyshow #unacademyroadsafetyworldseries #YehJungHaiLegendary #LegendsAreBack #voot #raveegaekwad #roadsafety pic.twitter.com/b1FOdJxH5T
— Road Safety World Series (@RSWorldSeries) March 11, 2020
లక్ష్య ఛేదనలో గిబ్స్(1) సహా టాప్-4 బ్యాట్స్‌మెన్ 42 పరుగులకే ఔటయ్యారు. కష్టాల్లో చిక్కుకున్న సఫారీ జట్టును జాంటీ రోడ్స్ 53*(40 బంతుల్లో; 6 ఫోర్లు, 1 సిక్సర్), అల్బీ మోర్కెల్ 54*(30 బంతుల్లో; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరూ చివరివరకు అజేయంగా ఉండి మ్యాచ్‌ను ముగించారు. ఫలితంగా 18.3 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి విజయం సాధించింది దక్షిణాఫ్రికా లెజెండ్స్ జట్టు. విండీస్ బౌలర్లలో బెస్ట్ 2 వికెట్లు, బెన్, సాన్ఫోర్డ్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న మోర్కెల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.