రోడ్ సేఫ్టీ సిరీస్ సెమీఫైనల్లో ఇండియా లెజెండ్స్ రెచ్చిపోయింది. విండీస్ లెజెండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ఓపెనర్లు సచిన్-సెహ్వాగ్ జోడీ తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
సచిన్ తెందుల్కర్ (42 బంతుల్లో 65) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా.. సెహ్వాగ్ (17 బంతుల్లో 35), యూసుఫ్ పఠాన్ (20 బంతుల్లో 37*), యువరాజ్ (20 బంతుల్లో 49*) విధ్వంసం సృష్టించారు. బ్యాటింగ్ చేసిన ప్రతి భారత ఆటగాడు మెరుగైన ప్రదర్శన చేశారు. విండీస్ బౌలర్లలో టినో బెస్ట్ 2 వికెట్లు తీసుకున్నాడు.
యువీ విధ్వంసం..
యువరాజ్ సింగ్ కేవలం 20 బంతుల్లోనే 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి రెండు ఓవర్లలో మునుపటి యువీని గుర్తు చేస్తూ.. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు కొట్టిన యువీ.. మొత్తంగా నాలుగు బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు. ఇక చివరి ఓవర్లోనూ మరో రెండు సిక్స్‌లతో ఇన్నింగ్స్‌ను ముగించాడు. హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చి ఒక్క పరుగు తేడాతో అజేయంగా నిలిచాడు.
ఇదీ చదవండి: ఏడేళ్లకు జట్టుకట్టినా తొలి మ్యాచ్‌లోనే ఓటమి