టీమ్ఇండియా యువ బ్యాట్స్‌మన్, వికెట్‌కీపర్ రిషభ్ పంత్ ఇలాగే బ్యాటింగ్ చేస్తే దిగ్గజ ఆటగాళ్లు మహేంద్రసింగ్ ధోనీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లను అధిగమిస్తాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసించాడు. ఇటీవల పంత్, అన్ని ఫార్మాట్లలో ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలోనూ పంత్(77) దంచికొట్టాడు. ఈ నేపథ్యంలోనే ఇంజమామ్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ పంత్‌ను పొగిడాడు.
'టీమ్ఇండియాకు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లో దూకుడు తీసుకొచ్చింది రిషభ్‌పంత్. అతడి వల్లే టీమ్‌ఇండియా రన్‌రేట్ పెరిగింది. పంత్‌ను కొద్దికాలంగా ఫాలో అవుతున్నా. భిన్న స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ అద్భుతంగా పరుగులు చేస్తున్న తీరు అమోఘం. అతడు ఆడే విధానం, పరుగులు చేసే తీరు.. గత 30 ఏళ్లలో నేను ఇద్దరిలోనే చూశాను. వాళ్లే ధోనీ, గిల్‌క్రిస్ట్. ఈ ఇద్దరు వికెట్‌కీపర్లూ మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సమర్థులు. పంత్ ఇలాగే కొనసాగితే వాళ్లిద్దర్నీ అధిగమిస్తాడు' అని ఇంజమామ్ చెప్పుకొచ్చాడు.
ఇది చదవండి: ఓపెనర్లు రోహిత్-ధావన్ సరికొత్త రికార్డు